జై సింహా మూవీ రివ్యూ   Jai Simha Movie Review     2018-01-11   22:25:14  IST  Raghu V

టైటిల్‌: జై సింహా

నటీనటులు: బాలకృష్ణ , నయనతార , నటాషా దోషి, హరి ప్రియ, ముర‌ళీమోహ‌న్ త‌దిత‌రులు

సినిమాటోగ్రఫీ: సి. రామ్ ప్రసాద్

ఎడిటర్: ప్రవీణ్ ఆంటోనీ

మ్యూజిక్: చిరంతన్ భట్

నిర్మాత: సి. కళ్యాణ్

దర్శకత్వం: కె.ఎస్. రవికుమార్

సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ

రిలీజ్ డేట్‌: 12 జ‌న‌వ‌రి, 2017

నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ‘జైసింహా’ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ రోజు విడుద‌ల అయ్యింది. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాతో బాలయ్య సంక్రాంతి విజేతగా నిలిచేందుకు తాపత్రయ పడుతున్నాడు. గత సంవత్సరం సంక్రాంతికి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంతో బాలకృష్ణ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు కూడా మరోసారి సక్సెస్‌ను దక్కించుకుని సెంటిమెంట్‌ను కంటిన్యూ చేయాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. గతంలో సంక్రాంతి బాలయ్య పలు సినిమాలతో వచ్చి విజయాలను దక్కించుకున్నాడు. బాలయ్య 102వ చిత్రంగా తెరకెక్కిన జైసింహా చిత్రం చాలా ప్రత్యేకం అంటూ నందమూరి ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో telugustop.com స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ: నరసింహ(బాలయ్య ) ,గౌరీ (నయనతార ) ఇద్దరు ఒకే స్కూల్ లో చదువుకుంటారు..చిన్నతనంలోనే నరసింహ తల్లి చనిపోవడంతో నయనతార ,బాలకృష్ణ ఇద్దరు మంచి స్నేహితులాగా ఉంటారు కట్ చేస్తే..స్నేహం ప్రేమగా మారుతుంది.. నయనతార తండ్రి (ప్రకాష్ రాజ్) కి ఇద్దరి ప్రేమ నచ్చదు..పెళ్లి చేసుకోవాలనుకున్న ఇద్దరి కోరికని ప్రకాష్ రాజ్ ఒప్పుకోడు..కట్ చేస్తే బాలయ్య తన పిల్లాడిని తీసుకుని వైజాగ్ నుంచీ కేరళా వెళ్తాడు అక్కడి నుంచీ తమిళనాడు వెళ్తాడు..అక్కడ ఒక గుడి ధర్మకర్త దగ్గర డ్రైవర్ గా చేరుతాడు..అక్కడ ఉండే పోలీసు ఆఫీసర్ కి బాలయ్యకి మధ్య గొడవ జరుగుతుంది..పోలీసు ఆఫీసర్ బాలయ్యపై పగపెట్టుకుంటాడు..ఇంతలో జైలు లో ఉరిశిక్ష అనుభవిస్తున్న వైజాగ్ రామిరెడ్డి (అస్తోష్ రాణా) బాలకృష్ణ ని చంపాలని జైలు నుంచీ తప్పించుకుంటాడు.. అసలు బాలయ్య ,నయనతారల వివాహానికి ఎందుకు ప్రకాష్ రాజ్ ఒప్పుకోడు?..బాలయ్య నయనతారల వివాహం జరిగిందా..? అసలు బాలయ్య దగ్గర ఉన్న పిల్లాడు ఎవరు..? ఆ పోలీసు ఆఫీసర్ ఎవరు..? వైజాగ్ రామిరెడ్డి..బాలయ్యని ఎందుకు చంపాలి అనుకుంటాడు…?..తమిళనాడులో ఉండే అనే ఆసక్తికరమైన విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేష‌ణ : నందమూరి బాలకృష్ణ కి ఉన్న సంక్రాంతి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యింది అని చెప్పవచ్చు..అంతేకాదు ఈ సంక్రాంతికి పందెం గెలిచినా కోడి బాలయ్య అని ఈ సినిమా రుజువు చేసింది అనే చెప్పాలి..సినిమా మొత్తం బాలయ్య బుజాలపైనే నడిచింది..మరో సారి బాలయ్య తన నట విశ్వరూపం చూపించాడు..డ్యాన్సుల్లో గానీ డైలాగులలో కానీ..రౌద్రాన్ని ముఖంపై చూపించడం లాంటి అంశాలు బలయ్యకి బ్లడ్ లోనే ఉన్నాయి అని మరోసారి నిరూపించాడు..ఈ సినిమాలో బాలయ్య తరువాత ప్రధానత్య ఉన్న వ్యక్తి..నయనతార వీరి ఇద్దరి ప్రేమ సన్నివేశాలు. చూస్తుంటే బాలయ్య కుర్రాడిలా మారిపోయాడు అనిపిస్తుంది..ప్రకాష్ రాజ్ నిడివి కొతసేపు అయినా సరే తనదైన శైలిలో నటించాడు..విలన్ గా నటించిన అస్తోష్ రాణా కూడా బాగానే చేశాడు.

బాలయ్యతో పాటు జట్టు కట్టిన హీరోయిన్స్ ఎవరి స్థాయిలో వాళ్ళు నటించారు..బ్రహ్మానందం కామెడీ అంతగా ఆకట్టుకోలేక పోయింది..మొదటి భాగంలో బాలయ్య తన ఫైట్లు తో సినిమాని ఓ రేంజ్ కి తీసుకుని వెళ్ళాడు. బ్రహ్మణులని ఉద్దేశించి బాలయ్య చెప్పిన డైలాగులు సినిమాకి హైలెట్ గా ఉంటుంది..ఇక బాలయ్య గురించి చెప్పాలంటే సినిమాలో రౌద్రాన్ని బాలయ్య ఎలా పండించాడో..సెంటిమెంట్ సీన్స్ కూడా అలాగే రక్తి కట్టించాడు..మొదటి భాగంలో ధర్నా చేస్తున్న విలన్ వైజాగ్ రామిరెడ్డి (అస్తోష్ రాణా) కొడుకుని నామినేషన్ వేయకుండా అడ్డుకునే సన్నివేశం ప్రేక్షకుల చే చప్పట్లు కొట్టిస్తాయి..త్యాగం అనే మాటకి బాలయ్య ఈ సినిమాలో పోషించిన పాత్రకి అభిమానుల నుంచీ చూసే ప్రేక్షకుల వరకూ అందరు గులాం అవ్వాల్సిందే..అయితే సెకండ్ హాఫ్ మాత్రం కొంచం డల్ అయ్యింది..

సాంకేతికంగా చుస్తే

జై సింహా సినిమాకి సంగీతం “చిరంతన్ భట్” అందించిన పాటలు పరంగా ఎప్పుడో హిట్ టాక్ తెచ్చుకుంది ..సినిమాలో RR మాత్రం ఓ రేంజ్ లో ఉంది..ఫైట్ సీన్స్ లో వచ్చే మ్యూజిక్ కి ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు..డైరెక్టర్ కె.ఎస్. రవికుమార్ సినిమాలో సెంటిమెంట్ స్థాయిని కానీ బాలయ్య చూపులో ఉండే పౌరుషాన్ని బాగా ఎలివేట్ చేశాడు..

అయితే సినిమాటోగ్రఫీ పరంగా మాత్రం కొంచం మైనస్ అనే చెప్పాలి..అంతేకాదు బ్రహ్మానందం కామెడి అస్సలు బాగోలేదు “ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అందరికి తెలుసు కానీ కామెడి కూడా ఓల్డ్ గా నవ్వు తెప్పించే విధంగా లేదు అనే చెప్పాలి.. మధ్య మధ్యలో బాలయ్య చెప్పే డైలాగులు ప్రేక్షకులచే ఈలలు వేయించాయి..బాలయ్య ఒక ప్రేమికుడిగా సినిమాలో కంటతడి పెట్టించాడు..నేను చచ్చినా నా ప్రేమ చావదు అంటూ బాలయ్యతో డైరెక్టర్ పలికించిన ఈ డైలాగు బాలయ్యలో కొత్త కోణం దాగుందా అనిపిస్తుంది..నిర్మాత సి.కళ్యాణ్ కి ఈ సంక్రాంతికి బాగానే ముట్టింది అని చెప్పచ్చు నిర్మాణ విలువలు బాగున్నాయి.

+లు:

– బాలయ్య నటవిస్వరూపం

– మ్యూజిక్

– డైలాగులు

– సెంటిమెంట్

_లు

– సినిమాటోగ్రఫీ

– కామెడి

రేటింగ్ – 3/5