''జై బాలయ్య''కు అదిరిపోయే రెస్పాన్స్.. ఎన్ని వ్యూస్ వచ్చాయంటే?

నటసింహం నందమూరి బాలకృష్ణ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన ‘అఖండ‘ సినిమా షూటింగ్ ముగించేసుకుని విడుదలకు సిద్ధం అయ్యింది.ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అయినా పోస్టర్స్, టీజర్, పాటలు అన్ని కూడా ఈ సినిమాపై మంచి అంచనాలను పెంచేసాయి.

 Jai Balayya Song From Akhanda Touch The 8 Million Mark, 8 Million Mark, Jai Bala-TeluguStop.com

ఇక ఈ సినిమా డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

ముందు నుండే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

వీరిని మేకర్స్ తమ ప్రమోషన్స్ తో మరింత పెంచేశారు.ఇక ఇటీవలే రిలీజ్ చేసిన మాస్ నెంబర్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ లభించింది.

ఈ పాటను రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చారు.జై బాలయ్య సాంగ్ విడుదల అయ్యి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

బాలకృష్ణ, హీరోయిన్ ప్రగ్య జైశ్వాల్ లపై ఈ పాటను డిజైన్ చేసి రిలీజ్ చేసారు.

Telugu Mark, Akhanda, Balakrishna, Boyapati Srinu, Jai Balayya, Jaibalayya, Prag

ఇక ఈ అదిరిపోయే మాస్ సాంగ్ కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది.ఈ పాట ఇప్పటికే దాదాపు 8 మిలియన్ ప్లస్ వ్యూస్ తో దూసుకు వెళ్తుంది.ఇక ఈ సినిమా థమన్ అందించిన సంగీతం కూడా మంచి ప్లస్ అయ్యింది.

ఇక జై బాలయ్య సాంగ్ లో బాలయ్య వేసిన స్టెప్స్ కూడా నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించాయి.

Telugu Mark, Akhanda, Balakrishna, Boyapati Srinu, Jai Balayya, Jaibalayya, Prag

ఇక ఈ సాంగ్ ను బిగ్ స్క్రీన్ మీద ఎలా ఉండబోతుందో చూసేందుకు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.సింహ, లెజెండ్ తర్వాత బాలయ్య బోయపాటి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అందరు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

చూడాలి మరి వీరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా అంచనాలను ఏ విధంగా అందుకుంటుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube