తెలంగాణలో అక్కడ స్వచ్ఛంద లాక్‌‌డౌన్.. ?

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఏ స్దాయిలో జరుగుతుందో అందరికి తెలిసిందే.ఈ క్రమంలో ఇక్కడి ప్రభుత్వం ప్రజలకు కొన్ని కఠిన నియమాలను విధించింది కానీ అవి పాటించే వారు ఎందరు.

 Jagityala District Siripur Village People Follows Voluntary Lock Down , Telangan-TeluguStop.com

అందుకే జరిమానాలను కూడా వసూలు చేస్తుంది.అయినా ప్రజల్లో కరోనా అంటే గానీ, ఫైన్ అంటే గానీ భయం కనిపించడం లేదట.

ఇదిలా ఉండగా కరో‌నాను కట్టడి చేసేం‌దుకు జగి‌త్యాల జిల్లా మల్లా‌పూర్‌ మండలం సిరి‌పూ‌ర్‌లోని గ్రామ‌స్థులు కీలక నిర్ణయం తీసుకున్నారు.వారికి వారే స్వచ్ఛంద లాక్‌‌డౌన్‌ విధించు‌కు‌న్నారు.నిన్న జరిగిన సిరి‌పూ‌ర్‌ సర్పంచ్‌ భూక్యా గోవిం‌ద్‌‌నా‌యక్‌ ఆధ్వ‌ర్యంలో పంచా‌యతీ పాల‌క‌వర్గం ప్రత్యే‌కంగా సమా‌వే‌శమై ఈ విషయాన్ని ఏక‌గ్రీ‌వంగా తీర్మా‌నిం‌చిందట.

Telugu Rs Fine, Corona, Jagittala, Mallapur, Sarpanchbhukya, Siripur, Telangana-

ఈ నేపధ్యంలో ఈనెల 15 వరకు ఈ గ్రామంలో ఉన్న హెయిర్‌ కటిం‌గ్‌‌షా‌పులు, హోటళ్లు మూసి‌ వే‌యా‌లని, కిరాణ, ఇతర దుకా‌ణాలు ఉదయం 6 నుంచి ఉదయం 10 వరకు, సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు మాత్రమే తెరిచి ఉంచా‌లనే నిర్ణయానికి వచ్చారట.

అంతే కాకుండా ‌ప్రతి ఒక్క వ్యక్తి విధిగా మాస్క్‌ ధరించాలని, నిర్ణీత దూరం పాటించాలనే నియమాన్ని విధించగా, ఎవరైతే కరోనా నిబంధన ఉల్లంఘిస్తారో వారికి రూ.వెయ్యి జరి‌మానా విధి‌స్తా‌మని హెచ్చ‌రిం‌చారట.

నిజమే కదా ప్రస్తుత పరిస్దితుల్లో ప్రజలందరు ఇలాగే ఆలోచిస్తే ఎంత బాగుంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube