ఢిల్లీలో ఎంపీ ర‌ఘురామ వ్య‌వ‌హారంపై స్పీడ్ పెంచిన జ‌గ‌న్‌..!

మొన్న‌టి వ‌ర‌కు ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌న‌గా మారిన ఎంపీ ర‌ఘురామ విష‌యంలో జ‌గ‌న్ ఆచితూచి వ్య‌వ‌హ‌రించారు.ఎంపీ ర‌ఘురామ వరుస‌గా కేంద్ర మంత్రుల‌కు ఫిర్యాదులు చేసినప్ప‌టికీ.

 Jagin Speeds Up Mp Raghuram S Affair In Delhi Ycp Jagan-TeluguStop.com

దానిపై పెద్ద‌గా స్పందించ‌లేదు.కానీ ఒక్కసారిగా ఆయ‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న త‌ర్వాత దీనిపై ఫోక‌స్ పెట్టారు.

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న ఏం మాట్లాడారో ఏమో గానీ ఆ త‌ర్వాత‌నే స్పీడ్ పెంచారు జ‌గ‌న్‌.పైగా ఎంపీ వ్య‌వ‌హారంపై చాలా సీరియ‌స్‌గా కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

 Jagin Speeds Up Mp Raghuram S Affair In Delhi Ycp Jagan-ఢిల్లీలో ఎంపీ ర‌ఘురామ వ్య‌వ‌హారంపై స్పీడ్ పెంచిన జ‌గ‌న్‌..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Ap Cm Jagan, Mp Raghu Rama Krishna Raju-Telugu Political News

ఇందుకోసం ఎంపీకి చెక్ పెట్టే విధంగా ప‌క్కా వ్యూహం ప‌న్న్నారు.ఇక రీసెంట్‌గా వైసీపీ రాజ‌మండ్రి ఎంపీ, విప్ అయిన‌టువంటి మార్గాని భరత్ తో చ‌క్రం తిప్పారు జ‌గ‌న్‌.భ‌ర‌త్ లోక్ సభ స్పీకర్ ను కలిసి రెబ‌ల్ ఎంపీ అయిన ర‌ఘురామ‌పై అనర్హత వేటు వేయాలని కోర‌డం సంచ‌ల‌నం రేపింది.అధికార పార్టీలో ఉంటూ పార్టీకి, ప్ర‌భుత్వానికి ప్ర‌తిష్ట దిగ‌జార్చుతున్న ఎంపీపై కొర‌డా వేయాల‌ని భ‌ర‌త్ కోర‌డం రాజ‌కీయ దుమారం రేపింది.

కాగా ఇందులో మాత్రం బీజేపీ పెద్ద సీరియ‌స్ గా లేన‌ట్టు తెలుస్తోంది.ఇందులో కూడా రాజ‌కీయ ల‌బ్ధి కోస‌మే బీజేపీ ఎదురుచూస్తున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంద‌.

ఎంపీ భ‌ర‌త్ ఫిర్యాదుపై బీజేపీ ఆల‌స్యం కావాల‌నే చేస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది.వైసీపీ కోరిన‌ట్టు ఎంపీ ర‌ఘురామ‌పై స్పీకర్ అనర్హత వేటు వేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది.

దానికి ప్ర‌ధాన‌మంత్రి నరేంద్రమోడీ ఆమోదం క‌చ్చితంగా కావాలి.దీనికి టెక్నిక‌ల్‌గా ప్ర‌ధానికి సంబంధం లేక‌పోయినా.

ఆయ‌న‌కు తెలియ‌కుండా ఏమీ జ‌ర‌గ‌దు క‌దా ఇప్ప‌టి రాజ‌కీయాల్లో.

Telugu Ap Cm Jagan, Mp Raghu Rama Krishna Raju-Telugu Political News

అయితే గ‌తంలో జనతాదళ్ నేత శరద్ యాదవ్ విష‌యంలో తీసుకున్న చొర‌వ వైసీపీ ఫిర్యాదులో చూప‌ట్లేదు బీజేపీ.శ‌ర‌ద్ యాద‌వ్‌పై కేవ‌లం నాలుగు రోజుల్లోనే నిర్ణ‌యం తీసుకుని, ఆయ‌న్ను అన‌ర్హుడిగా వేటు వేశార స్పీక‌ర్‌.కానీ ఇక్క‌డ మాత్రం భ‌ర‌త్ ఫిర్యాదుపై కావాల‌నే ఆల‌స్యం జ‌రుగుతోంది.

చూడాలి మ‌రి జ‌గ‌న్ ఏ విధంగా ముందుకెళ్తారో.

#MPRaghu #AP CM Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు