ఉదయం లేవగానే ఒక కప్పు వేడి వేడి టీ తాగితే.ఎంత హాయిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
టీ తాగకుంటే చాలా మందికి రోజు కూడా గడవదు.అంతలా టీకి అలవాటు పడుతుంటారు.
కొందరు ఉదయం పూటే కాదు మధ్యాహ్నం, సాయంత్రం ఇలా ఎప్పుడు పడితే అప్పుడు టీని సేవిస్తుంటారు.అయితే టీ తీసుకోవడం వల్ల అందులో ఉండే చక్కెర మన శరీరానికి హాని కలగజేస్తుంది.
ఎందుకంటే, చక్కెర తయారీలో రసాయనాలు ఎక్కువగా వడతారు.దాంతో చక్కెరలో పోషక విలువలు నశించి.
తీపి రుచి ఒక్కటే మిగిలిపోతుంది.
అటువంటి చక్కెరను తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ముఖ్యంగా టీ ద్వారా చాలా మంది చక్కెర తీసుకుంటారు.అందుకే టీలో చక్కెర బదులు బెల్లం తీసుకోమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
టీలో బెల్లం కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందొచ్చని అంటున్నారు.ముఖ్యంగా టీలో చక్కెర బదులు బెల్లం కలిపి తీసుకుంటే.
రక్త హీనత సమస్య దూరం అవుతుంది.

బెల్లంలో పుష్కలంగా ఐరన్ కంటెంట్ ఉంటుంది.అందువల్ల టీలో బెల్లం కలిపి తీసుకుంటే.రక్త హీనత సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
అలాగే మలబద్ధకం సమస్యతో బాధ పడే వారు టీలో చక్కెర బదులుగా బెల్లాన్ని కలిపి ఉదయం పూట తీసుకుంటే.జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగుపడుతుంది.మరియు మలబద్ధకం సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.
ఇక అధిక రక్తపోటుతో ఇబ్బంది పడే వారు కూడా టీలో బెల్లాన్ని కలిపి తీసుకోవడమే బెస్ట్ అంటున్నారు నిపుణులు.
ఎందుకంటే, రక్తపోటును కంట్రోల్‌లో ఉంచడంలో బెల్లం గ్రేట్‌గా సహాయపడుతుంది.అలాగే టీలో బెల్లంతో పాటు కాసింత అల్లం, మిరియాలు కూడా వేసుకొని తాగితే.శరీర రోగ నిరోధక శక్తి బలపడుతుంది.దాంతో సీజనల్‌గా వచ్చే రోగాలకు దూరంగా ఉండొచ్చు.