ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒకప్పుడు రేవంత్ పేరెత్తితేనే భగ్గుమనేవారు.ఆయనకు టీపీసీసీ ఎందుకంటూ ఏకంగా సోనియా గాంధీని కూడా నేరుగా ప్రశ్నించారు.
తనకు ఇస్తే బాగుంటుందని కూడా విజ్ఞప్తి చేశారు.అయితే ఆయన మొదట్లో రేవంత్ నాయకత్వాన్ని పెద్దగా ఇష్టపడకపోయినా కూడా ఇప్పుడు నెమ్మదిగా రేవంత్ దారిలోకే వస్తున్నారని అర్థమవుతోంది.
ఎందుకంటే ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అచ్చం రేవంత్ చెబుతున్న వాటిలాగే ఉంటున్నాయి.దీంతో ఇప్పుడు అందరూ కూడా జగ్గారెడ్డి దారిలోకి వస్తున్నారని, ఇలాంటి మార్పే కావాలంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఆయన అంతగా ఏం మాట్లాడారంటే ఇప్పుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటున్న జగ్గారెడ్డి రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్లు చేశారు.ఇప్పుడు రేవంత్ చేపడుతున్న వరంగల్ జిల్లాలో జరుగుతున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌పై మరోసారి నిప్పులు చెరిగారు.
కాగా ఆయన లాంటి సీఎంలు పనికిరారని, ఆయన పోలీసులతో తమను ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు.కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో సీఎంగా ఉండరని, కాబట్టి ఆ విషయాన్ని పోలీసు అధికారులు గుర్తుంచుకోవాలన్నారు.
లేకపోతే మాత్రం ఇప్పుడు తమను ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు గుర్తుంచుకుని మరీ వారి సంగతి తాము అధికారంలోకి చూస్తామంటూ జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు.అయితే గతంలో కూడా రేవంత్‌రెడ్డి చాలాసార్లు ఇలాగే పోలీసుల విషయంలో సీరియస్ అయ్యేవారు.వారి సంగతి చెప్తామంటూ ఆయన కూడా ఇలాగా మాట్లాడేవారు.ఇక ఇప్పుడు జగ్గారెడ్డి కూడా ఇవే మాటలు మాట్లాడటంతో ఆయన ఇప్పుడు కన్విన్స్ అయిపోయారనిచెబుతున్నారు.ఏదేమైనా కూడా రేవంత్నాయకత్వాన్ని ఇలా జగ్గారెడ్డి ఇన్‌డైరెక్టుగా ఒప్పేసుకుంటున్నారన్నమాట.అయితే మిగతా సీనియర్లు కూడా ఇలాగే రేవంత్‌కు మద్దతుగా నిలిస్తే బాగుంటుందని చాలామంది కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు.