రేవంత్ పై జగ్గారెడ్డి ఫైర్ ! కాంగ్రెస్ లో విభేధాలు తారా స్థాయికి ?

తెలంగాణలో రాజకీయాలు ఎన్నో మలుపులు తిరుగుతున్నా, కాంగ్రెస్ లో మాత్రం పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది.ఆ పార్టీలో సీనియర్ జూనియర్ నాయకుల మధ్య విభేదాలు తీవ్రతరం అవుతున్నాయి.

 Jaggareddy Fires On Rewanth Disagreements In Congress To Tara Level-TeluguStop.com

ముఖ్యంగా రేవంత్ రెడ్డి విషయంలో సీనియర్లంతా ఏకతాటిపై ఉంటూ ఎప్పుడూ ఆయన ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు.ఇవన్నీ టిఆర్ఎస్ బిజెపిలకు బాగా కలిసి వస్తున్నాయి.

ముఖ్యంగా రేవంత్ రెడ్డి కి పిసిసి అధ్యక్ష పదవి దక్కిన దగ్గర నుంచి సీనియర్ నాయకులు ఏదో ఒక సందర్భంలో తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తూ వస్తున్నారు.తాజాగా సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేవంత్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

 Jaggareddy Fires On Rewanth Disagreements In Congress To Tara Level-రేవంత్ పై జగ్గారెడ్డి ఫైర్ కాంగ్రెస్ లో విభేధాలు తారా స్థాయికి -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాంగ్రెస్ పార్టీలో సింగిల్ హీరో కుదరదని, ఒక్కడి ఇమేజ్ కోసం మిగతా వారు అందరినీ తొక్కే ప్రయత్నం చేయడం మంచిది కాదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
  ఇది పార్టీనా లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నా అంటూ ప్రశ్నించారు.

పార్టీలో చర్చించకుండా ముందుగా ప్రోగ్రాములు ఏర్పాటు చేయడం ఏమిటని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ని ప్రశ్నించారు.కాంగ్రెస్ లో అందరూ ఒకటేనని ఒక్కరే స్టార్ అనుకుంటే కుదరదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంగారెడ్డి నియోజకవర్గానికి పిసిసి అధ్యక్షుడు వస్తే నాకు సమాచారం ఇవ్వరా ఈ మాత్రం ప్రోటోకాల్ కూడా తెలియదా అంటూ జగ్గా రెడ్డి ప్రశ్నించారు.
  ఇంకా అనేక అంశాలపై జగ్గారెడ్డి రేవంత్ పై విమర్శలు చేయడంతో జాగ్గా రెడ్డి రేవంత్ కు మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయనే  ఈ విషయం బహిర్గతమైంది.

ఈయనే కాదు, కాంగ్రెస్ సీనియర్లు చాలామంది రేవంత్ విషయంలో ఇదే వైఖరితో ఉంటూ వస్తున్నారు.ఉమ్మడిగా టిఆర్ఎస్ బిజెపి లపై పోరాటం చేయాల్సి ఉన్నా, తమ పార్టీ నేతలపైనే విమర్శలు చేస్తూ మరంత గా పార్టీకి నష్టం చేకూరుస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.

#Rewanth Reddy #PCC Rewanth #Sanga #Telangana #Congress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు