కాంగ్రెస్ మీద అసంతృప్తి ఉన్న జగ్గారెడ్డి! త్వరలో టీఆర్ఎస్ గూటికి

సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీ మీద, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద తీవ్ర విమర్శలు చేసారు.అయితే ఊహించని విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చి టీఆర్ఎస్ గూటికి చేరేందుకు రెడీ అవుతున్నారు.

 Jagga Reddy Confirm To Join Trs-TeluguStop.com

గత కొంత కాలంగా కాంగ్రెస్ పెద్దలపై తీవ్ర అసంతృప్తి ఉన్న జగ్గారెడ్డి, పార్టీ వ్యవహారాలకి దూరంగా ఉంటూ వస్తున్నట్లు తెలుస్తుంది.మరో వైపు టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష కి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కారు ఎక్కేస్తున్నారు.

ఇప్పటికే ఎనిమిది మంది వరకు టీఆర్ లో చేరడానికి రెడీ అయిపోయారు.

ఈ నేపధ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఇక గగనమే అని ఫిక్స్ అయిన సీనియర్ నేతలు కూడా ఒక్కొక్కరు దూరం అవుతున్నారు.

ఇప్పటికే సబితా ఇంద్రారెడ్డి తన కొడుకుతో కలిసి కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు.ఈ నేపధ్యంలో జగ్గారెడ్డి కూడా టీఆర్ఎస్ పార్టీకి దగ్గరైనట్లు తెలుస్తుంది.ఇప్పటికే కేటీఆర్ తో జగ్గారెడ్డి చర్చించడం జరిగిందని, ప్రస్తుతం కార్యకర్తలతో చర్చించిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు అతన్ని సంప్రదించే ప్రయత్నం చేస్తున్న కూడా అందుబాటులోకి రావడం లేదని సమాచారం వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube