రేవంత్‌ చేసిన పనికి కాంగ్రెస్‌కు సంబంధం లేదు  

Jagga Reddy Comments On Revanth Reddy About Drone Fly On Ktr Farm House - Telugu Congress Party, Kcr, Ktr Farm House, Revanth Reddy, Revanth Reddy Issue

కేటీఆర్‌ ఫామ్‌ హౌస్‌ను డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించినందుకు గాను రేవంత్‌ రెడ్డిపై కేసు నమోదు అయిన విషయం తెల్సిందే.తెలంగాణ పోలీసులు కేటీఆర్‌పై దాడికి ప్రయత్నించారు అనే ఆరోపణతో రేవంత్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయడం జరిగింది.

 Jagga Reddy Comments On Revanth Reddy About Drone Fly On Ktr Farm House

రేవంత్‌ రెడ్డితో పాటు మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయంపై కాంగ్రెస్‌ నేతలు భిన్న వాదనలు వ్యక్తం చేస్తున్నారు.కాంగ్రెస్‌ నేతలు ఆ వ్యవహారంతో తమకు సంబంధం లేదు అంటూ కొందరు వాదిస్తూ ఉంటే కొందరు మాత్రం ఆయన కాంగ్రెస్‌ వ్యక్తి కనుక కాంగ్రెస్‌ సాయంగా ఉండాలని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశాడు.కేటీఆర్‌ ఫామ్‌ హౌస్‌పై డ్రోన్‌ కెమెరాను తిప్పడం అనేది ఆయన వ్యక్తిగత విషయం.రేవంత్‌ రెడ్డి వ్యక్తిగత కారణాలతో డ్రోన్‌ తిప్పించాడో లేదంటే మరేంటో కాని ఆ వ్యవహారంకు కాంగ్రెస్‌కు అస్సలు సంబంధం లేదు.అందుకే కాంగ్రెస్‌ తరపు నుండి ఆయనకు ఎలాంటి న్యాయ సహాయం చేయాలని భావించడం లేదు అన్నాడు.

రేవంత్‌ చేసిన పనికి కాంగ్రెస్‌కు సంబంధం లేదు-Political-Telugu Tollywood Photo Image

ఎంపీ అయినందు వల్ల రేవంత్‌ రెడ్డి కోర్టు కేసు వ్యవహారంలో కాంగ్రెస్‌ పార్టీ మద్దతు కోరుతున్నట్లుగా సమాచారం అందుతోంది.అందుకే జగ్గారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test