హాలీవుడ్ సినిమాలో నటిస్తున్న అలీ

స్టార్ కమెడియన్ గా టాలీవుడ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు అలీ.చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత కమెడియన్ గా, హీరోగా వందల సంఖ్యలో సినిమాలు చేసిన అలీ ఇప్పుడు ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు రియాలిటీ షో కూడా చేస్తున్నాడు.

 Jagdish Dante Ali Martin Pinkjaquar-TeluguStop.com

ఇదిలా ఉంటే తెలుగుతో పాటు సౌత్ భాషలలో, అలాగే హిందీలో కూడా నటించిన అలీ ఇప్పుడు హాలీవుడ్ సినిమాలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు.గతంలో తెలుగు ఇండస్ట్రీ నుంచి రాజేంద్రప్రసాద్ ఓ హాలీవుడ్ మూవీలో హీరోగా నటించాడు.

జగదీష్‌ దానేటి అనే తెలుగు ఎన్నారై దర్శకత్వంలో అలీ హాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు.ఈ సినిమాను హాలీవుడ్‌కు చెందిన మార్టిన్ ఫిలిమ్స్, పింక్‌ జాగ్వర్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు నిర్మిస్తాయి.

ఈ సినిమా చిత్రీకరించడానికి అనుమతి కోసం అలీ, దర్శకుడు జగదీశ్ కొద్ది రోజుల క్రితం కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవడేకర్‌ను కలిశారుఈ సినిమా గురించి అలీ మాట్లాడుతూ హాలీవుడ్‌ సినిమా చేయడం చాలా సంతోషంగా, ఎగ్జయిటింగ్‌గా ఉందని అన్నారు.హలీవుడ్‌ సినిమా చేయాలనుకునేవాళ్లకు జగదీష్‌ ఓ మార్గం అవుతాడని చెప్పారు.

మరి ఇండియా నేపధ్యంలో నడిచే ఈ హాలీవుడ్ సినిమాలో ఎలా అలరిస్తాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube