ఆ విషయం పెద్దగా పట్టించుకోనంటున్న జగపతి బాబు..?  

Actor Jagapati babu shocking comments about his remuneration, Actor Jagapathi Babu,Jagapathi Babu Remuneration, Movie Offers, Kollywood, Mollywood, Story Selection, Jagapathi babu characters - Telugu Jagapati Babu Second Innings, Jagapatibabu, Jagapatibabu Remuneration, Legend, Nannaku Premato

టాలీవుడ్ ఇండస్ట్రీలో కుటుంబ కథా చిత్రాలలో ఎక్కువగా నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జగపతిబాబు.హీరోగా నటించిన సినిమాలు ఫ్లాప్ కావడం, అవకాశాలు తగ్గడంతో సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ పాత్రల ద్వారా, ప్రత్యేక పాత్రల ద్వారా జగపతిబాబు సత్తా చాటుతున్నారు.

TeluguStop.com - Jagapati Babu Shocking Comments About His Remuneration

ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో కొత్తదనం ఉన్న పాత్రల్లో జగపతిబాబు ఎక్కువగా నటిస్తున్నారు.
సెకండ్ ఇన్నింగ్స్ లో లెజెండ్, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, అరవింద సమేత సినిమాలు జగపతిబాబుకు మంచిపేరు తెచ్చిపెట్టాయి.

జగపతిబాబు ఎంత డిమాండ్ చేసినా ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో రెమ్యునరేషన్ కు సంబంధించిన ప్రశ్న ఎదురు కాగా జగపతిబాబు ఆ ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.

TeluguStop.com - ఆ విషయం పెద్దగా పట్టించుకోనంటున్న జగపతి బాబు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

తనకు రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా పట్టింపులు లేవని వెల్లడించారు.

తాను సెకండ్ ఇన్నింగ్స్ ను ఎంజాయ్ చేస్తున్నానని.

ఒక్కో సినిమాకు ఒక్కోలా రెమ్యునరేషన్ తీసుకుంటున్నానని తెలిపారు.డబ్బు అనేది తనకు పెద్దగా ముఖ్యం కాదని సినిమాల్లో తాను పోషిస్తున్న పాత్రలను చూసి తాను భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నానని భావిస్తే పొరపాటేనని అన్నారు.

సెకండ్ ఇన్నింగ్స్ లో ఇతర ఇండస్ట్రీలలోని నటులతో పరిచయాలు పెరుగుతున్నాయని అదే సమయంలో నవ్యత ఉన్న పాత్రలు దక్కుతున్నాయని చెప్పారు.

కథలో పాత్ర నచ్చితే పారితోషికం తగ్గించుకోవడానికైనా సిద్ధమని పేర్కొన్నారు.

కొన్ని రోజుల క్రితం ఒక సినిమా కథ నచ్చితే ఆ సినిమాలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించడానికి సిద్ధమయ్యానని అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా మొదలు కాలేదని అన్నారు.జగపతిబాబుకు టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు కోలీవుడ్, మల్లూవుడ్ ఇండస్ట్రీలలో కూడా అవకాశాలు వస్తున్నాయి.

సినిమా బడ్జెట్ ను బట్టి తన రెమ్యునరేషన్ లో అనేక మార్పులు ఉంటాయని పేర్కొన్నారు.

#Jagapatibabu #Nannaku Premato #Legend #JagapatiBabu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jagapati Babu Shocking Comments About His Remuneration Related Telugu News,Photos/Pics,Images..