డబ్బుంటే ఒక గోల.. లేకుంటే ఒక గోల.. జగపతి బాబు షాకింగ్ కామెంట్స్!

తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు, హీరో జగపతి బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అప్పట్లో హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నాడు.

 Jagapati Babu In Dubai With Familly, Jagapathi Babu, Dubai, Shopping, Familly, P-TeluguStop.com

ఇక అప్పట్లో జగపతి బాబు ఎక్కువగా ఫ్యామిలీ చిత్రాలలో నటిస్తూ ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు.ఇకపోతే ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ పాత్రలో నటిస్తూ వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకు పోతున్నాడు.

ఇక జగపతి బాబు తన కెరీర్ బిగినింగ్ నుంచి లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను అలాగే కొనసాగిస్తూ వస్తున్నారు.జగపతి బాబు ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు.

అంతే కాకుండా అతడికి నచ్చినట్టుగా జీవిస్తూ ఉంటాడు.మొత్తంగా నటుడిగా జగపతి బాబుది ప్రత్యేక శైలి అని చెప్పవచ్చు.

ఇకపోతే ప్రస్తుతం జగపతి బాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటిస్తూ సినిమా అవకాశాలు అందు కుంటూ దూసుకు పోతున్నాడు.ఇదిలా ఉంటే తాజాగా జగపతి బాబు అతని కుటుంబ సభ్యులతో కలిసి దుబాయి కి వెళ్లారు.

అక్కడ షాపింగ్ చేసిన తర్వాత అందుకు సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఒక ఆసక్తికరమైన పోస్ట్ ని చేశారు.ఆ పోస్టులో షాపింగ్ చేసి ఫుల్ లగేజీ తో షాపింగ్ మాల్ ముందు కూర్చొని ఉన్నారు.

ఆ ఫోటోని షేర్ చేసి డబ్బు లేక పోతే ఒక గోల.ఉంటే ఒక గోల అని రాసు కొచ్చారు.ప్రస్తుతం జగపతి బాబు చేసిన పోస్ట్, కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.జగపతి బాబు ఇటీవలే కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన గుడ్ లక్ సఖి  సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.

జగపతి బాబు సినిమాల విషయానికి వస్తే.గని, సలార్,రాధే శ్యామ్ లాంటి సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

ఇక  వీటిలో రాధేశ్యామ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.రాధేశ్యామ్ సినిమా ఈ నెల 11వ తేదీ న విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube