తనదైన యాక్టింగ్, తనదైన మార్క్ డైలాగ్ లతో తెలుగు ప్రేక్షకులను అందరూ తన అభిమానులుగా మార్చుకున్న జగత్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎన్నో సినిమాలలో హీరోగా నటించడమే కాకుండా కొన్ని సినిమాల్లో నెగటివ్ షేడ్స్ లో కూడా నటించి తన ప్రతిభ ఏమిటో నిరూపించుకున్న వ్యక్తి జగ్గు భాయ్.
తన నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.అలాంటి వ్యక్తి తాను ఒక సినిమాను చూసి ఇలాంటి సినిమాలలో తాను నటించాలంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చాడు.
ఇక అసలు విషయంలోకి వెళితే.
తాజాగా సుహాస్ చాందిని చౌదరి జంటగా నటించిన చిత్రం కలర్ ఫోటో.
ఈ సినిమా ఇటీవలే ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో విడుదలైన ఈ చిత్రం ఎంతో మంది సినీ క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకుంటోంది.విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కొనసాగే ప్రేమకథను ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా తెరకెక్కించారు.
ఇకపోతే తాజాగా ఈ చిత్రం సంబంధించి హీరో జగపతిబాబు సినిమా చిత్ర బృందం పై ప్రశంసల వర్షం కురిపించాడు.ఇందులో భాగంగా ఆ సినిమా చూశాక సంతోషంగా ఫీల్ అయ్యానని, సుహాస్ హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకున్నట్లు తెలిపాడు.
సినిమా డైరెక్టర్ ఈ వయసులోనే మంచి సినిమా తీశాడని పొగిడాడు.అంతే కాదు కాలభైరవ అందించిన మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉందని తెలిపాడు.ఈ సినిమాను డబ్బులు స్టార్స్ హిట్ చేయలేదని అందరికి మనసుకు హత్తుకు పోయేలా గొప్పగా ఉండడం ద్వారానే ఈ సినిమా విజయం సాధించడం సాధ్యమైందని తెలిపారు.నటీనటులందరూ తమ క్రియేటివిటీతో చాలా సహజసిద్ధంగా సినిమా చేయగలరని సినిమా చూస్తున్న సమయంలో చాలాసార్లు నేను ఆశ్చర్యపోయానని తెలిపాడు.
అంతే కాదు ఇలాంటి సినిమాలలో తనకు నటించడం అంటే ఎంతో ఇష్టమని తెలిపాడు.చాలామంది తనను డబ్బు ట్యాగ్ లేదా, చిన్న హీరోల సినిమాలో ఇలాంటి పాత్ర చేస్తావా అని అనుకొని ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
కాలాన్ని మార్చగలిగే ఇలాంటి గొప్ప సినిమాలో తాను నటించడానికి ఎప్పుడూ రెడీ అని చెప్పుకొచ్చారు.కాబట్టి ఏ డైరెక్టర్ అయినా సరే మంచి కథతో జగపతిబాబు ముందుకు వెళితే ఓకే చెప్తాడనడంలో ఎలాంటి సందేహం లేకపోలేదు.