క్లారిటీ ప్లీజ్ : టీడీపీ లో చేరాలనుకుంటున్న జగపతి బాబు ..?   Jagapathi Babu Whants To Join In TDP Party     2018-11-14   12:44:56  IST  Sai M

ఏపీలో ఈసారి ఎన్నికలు చాలా టాఫ్ గా ఉండేలా కనిపిస్తున్నాయి. టీడీపీ , వైసీపీ , జనసేన పార్టీలు అధికారం దక్కించుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో … అధికార పార్టీ టీడీపీ ఇప్పటి నుంచే గెలుపు వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. అందులో భాగంగానే… సినీ స్టార్స్ ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే సినీ నటి మంజు భార్గవి టీడీపీ లో చేరేందుకు సిద్ధం అయ్యింది. అలాగే హీరో సుమన్ కూడా రాజకీయాల్లోకి వచ్చి ఎమ్యెల్యే అయ్యేందుకు చూస్తున్నారు. అయితే ఏ పార్టీలోకి వెళ్లాలో తెలియక ఆయన అయోమయంలో ఉన్నాడు. ఇది ఇలా ఉండగానే… ఇప్పుడు టీడీపీలోకి జగపతి బాబు చేరబోతున్నాడు అనే వార్తలు గుప్పుమంటున్నాయి.

జగపతి బాబు అసలు రాజకీయాల్లోకి వస్తారని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఆయన వైజాగ్‌లో ఓ ర్యాలీ కూడా నిర్వహించారు.అప్పటి నుంచే జగపతి బాబు రాజాకీయాలలోకి వచ్చేస్తున్నారు.. అందుకే ఇదంతా చేస్తున్నారు అంటూ… రకరకాల వ్యాఖ్యలు వినిపించాయి. అయితే తాజాగా ఆయన త్వరలోనే అధికార టీడీపీ పార్టీలో చేరనున్నారని తెలుస్తుంది.ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. ఈ వార్తలను నిజం చేస్తు జగపతి బాబు మంగళవారం ఉదయం ఏపీ రాజధాని అమరావతిలో చంద్రబాబుని కలిశారు.

Jagapathi Babu Whants To Join In TDP Party-Chandrababu Naidu Party

జగపతిబాబు ఇలా ప్రత్యేకంగా వచ్చి చంద్రబాబుని కలవడం వెనక ఏదో రాజకీయ కోణం ఉండే ఉంటుందని టీడీపీ ముఖ్య నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. అంతే కాదు బాలకృష్ణకు జగపతిబాబుకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉండడంతో … జగపతి బాబు చేరిక లాంఛనమే అని అంతేకాకుండా ఆయనకు ఏదో ఒక నియోజకవర్గం నుంచి సీటు కూడా దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను కొట్టిపరేస్తున్నారు జగపతి బాబు సన్నిహితులు. జగపతిబాబు ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారని.. ఆయనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కూడా లేదని చెబుతున్నారు. నిప్పులేనిదే పుగా రాదు కదా ! మరికొన్ని రోజులు ఆగితే కానీ ఈ విషయం పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడంలేదు. జగపతి బాబు మాత్రం ఈ విషయం పై స్పష్టమైన అభిప్రాయం చెప్పేందుకు మొహమాటపడుతున్నట్టు తెలుస్తోంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.