వక్కంతం వంశీ దర్శకత్వంలో హీరోగా ట్రై చేస్తున్న జగపతి బాబు

జగపతి బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ బిజియస్ట్ యాక్టర్ గా ఉన్నాడని చెప్పాలి.హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకున్న తర్వాత అన్ని బాషలలో సినిమాలు చేస్తూ, విలన్ గా, హీరో తండ్రిగా అలాగే ఇతర ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ మంచి అవకాశాలు సొంతం చేసుకుంటున్నాడు.

 Jagapathi Babu Tries As A Hero Once Again-TeluguStop.com

ప్రస్తుతం హిందీలోకి కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా జగపతి బాబు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.ఓ విధంగా హీరోల స్థాయిలోనే జగపతి బాబు క్రేజ్ కూడా ఉంది.

ప్రస్తుతం జగపతి బాబు చేతిలో ఏకంగా పది సినిమాలు ఉన్నాయి.వీటిలో కొన్ని రిలీజ్ కి రెడీ కాగా, కొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి.

 Jagapathi Babu Tries As A Hero Once Again-వక్కంతం వంశీ దర్శకత్వంలో హీరోగా ట్రై చేస్తున్న జగపతి బాబు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా అప్పుడప్పుడు హీరోయిజం ఎలివేట్ అయ్యే పాత్రలని కూడా అతను చేస్తున్నాడు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న సమయంలోనే పటేల్ సర్ అనే సినిమా హీరోగా చేశాడు.

ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించిన సినిమా డిజాస్టర్ అయ్యింది.

Telugu Jagapathi Babu, Telugu Cinema, Tollywood, Vakkantham Vamsi-Movie

అయితే మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత మరోసారి హీరోగా ట్రై చేయబోతున్నట్లు తెలుస్తుంది రచయిత నుంచి దర్శకుడుగా మారిన వక్కంతం వంశీ రీసెంట్ గా జగపతి బాబు డిఫరెంట్ స్టొరీ లైన్ ఒకటి వినిపించడం జరిగిందని తెలుస్తుంది.ఏజ్ క్యారెక్టర్ తోనే ఈ మూవీ ఉండబోతుందని, అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఇంటరెస్టింగ్ గా ఉండటంతో జగపతిబాబు నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.దీనికి సంబంధించి లాక్ డౌన్ తర్వాత పూర్తి స్థాయి అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉందని టాక్.

వక్కంతం వంశీకి ఇద్దరు హీరోలు అవకాశం ఇచ్చిన వాళ్ళతో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి కనీసం ఏడాది సమయం అయినా పడుతుంది.ఈ లోపు జగపతిబాబుతో సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేసి తనని తాను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం.

#Jagapathi Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు