నాగశౌర్య సినిమాలో కీలక పాత్రలో జగపతి బాబు

యువ హీరో నాగ శౌర్య ప్రస్తుతం ఎలా అయినా కమర్షియల్ హీరోగా తనని తాను ఎలివేట్ చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.అందులో భాగంగా ప్రస్తుతంవిలువిద్య నేపధ్యంలో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళాడు.

 Jagapathi Babu Signed To Naga Shourya Movie, Tollywood, Santosh Jagarlapudi, Nag-TeluguStop.com

ఇక ఈ సినిమా కోసం శౌర్య తన శారీర ఆకృతిని పూర్తిగా మార్చేసుకొని పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది.

ఇదిలా ఉంటే వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి పతాకాలపై ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు నారయణదాస్‌ కె.నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం స్టార్ యాక్టర్ జగపతి బాబుని కన్ఫర్మ్ చేశారు.

అయితే ఇందులో ఆయన చేస్తుంది నెగిటివ్ పాత్రనా లేక హీరో శౌర్యకి కోచ్ గానా అనేది తెలియాల్సి ఉంది.ఈ సినిమాలో జగపతి బాటు నటించడం ద్వారా దీనికి మరింత హైప్ వచ్చింది.

ఇదిలా ఉంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని జాగ్రతలు తీసుకుంటూ ఈ నెల 18 నుండి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమై నాన్‌ స్టాప్‌గా జరుగుతుందని నిర్మాతలు తెలిపారు.కీరవాణి తనయుడు కాలబైరవ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

మరి శౌర్య కెరియర్ లో పెద్ద బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ సినిమా అతనికి ఎంత వరకు కోరుకున్న ఇమేజ్ ని తీసుకొస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇక ఈ సినిమాలో శౌర్యకి జోడీగా బాలీవుడ్ భామ కేతిక శర్మ హీరోయిన్ గా చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube