జగపతి బాబు ఆస్తి మొత్తం అలా ఆవిరైపోయింది!

జగపతి బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటించి తనదైన ముద్ర వేసుకున్నారు.అప్పట్లో హీరోగా జగపతి బాబు కు మంచి క్రేజ్ ఉండేది.

 Actor Jagapathi Babu About Financial Problems, Actor Jagapathi Babu, Financial P-TeluguStop.com

తన నటనతో ఎంతో మంది అభిమానులను పోగు చేసుకున్నారు.చిన్నతనం నుంచి చదువుపై పెద్దగా ఆసక్తి కనబరిచేవాడు కాదు.

తనకు నచ్చిన పని చేయడం జగపతిబాబు కి అసలు ఇష్టం ఉండేది కాదు.అందుకే పైచదువులు చదవ కుండా సినిమాల్లోకి వచ్చారు.

జగపతి బాబు తండ్రి నిర్మాత కావడంతో తన తండ్రి సొంత బ్యానర్ పై నిర్మించిన చిత్రాల్లో నటించడం ద్వారా తెలుగు పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు.

జగపతిబాబు మొదట్లో హీరోగా నటించిన కొన్ని సినిమాలు జగపతిబాబు కి చేదు అనుభవాన్ని మిగిల్చాయి.

తను నటించిన సినిమాలు హిట్ కాకపోవడంతో కొంత నిరాశకు సొంత బ్యానర్లోనే సినిమాలు చేయడం ద్వారా ఆస్తి కూడా నష్టపోయాడు.తరువాత తను నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ప్రజలను ఆకట్టుకున్నాయి దీంతో ఆస్తినిపోగు చేసుకున్నప్పటికీ, అతనికి జల్సా ఖర్చులకు,అడిగిన వారికి అడిగినట్లు సహాయం చేయడం జగపతిబాబు నైజం కావడం , ఫ్రెండ్స్ తో విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, ఇలా అతని జల్సా ఖర్చులకు అతని ఆస్తి మొత్తం ఆవిరైపోయింది.

సినిమాలలో అవకాశాలు లేక ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడిన జగపతిబాబుకు తిరిగి సినిమాల్లోకి రావాలని అనుకుంటుండగా,విలన్ గా లెజెండ్ సినిమాలో అవకాశం రావడంతో తిరిగి ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చాడు.లెజెండ్ సినిమా ఒక్కసారిగా పెద్ద హిట్ కావడంతో తర్వాత సినిమాలలో జగపతి బాబు విలన్ పాత్రలో నటించింది మరోసారి తన అభిమానులకుదగ్గరయ్యాడు.

నాన్నకు ప్రేమతో,సినిమాలో విలన్ క్యారెక్టర్ లో నటించారు.అంతేకాకుండా మరికొన్ని సినిమాలలో తండ్రి పాత్రలో నటించి కొంత మేర ఆస్తిని ఇప్పుడిప్పుడే పోగు చేసుకున్నారు.

అయితే ఇప్పటికి కూడా తనకి సొంత ఇల్లు కూడా లేదని జగపతిబాబు చెప్పడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube