టక్ జగదీష్ లో ఎవరికీ తెలియని జగపతి బాబు డార్క్ సీక్రెట్స్ ఇవే!

న్యాచులర్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా టక్ జగదీష్.ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతుంది.

 Jagapathi Babu Plays Negative Role In Nani Tuck Jagadish Movie, Jagapathi Babu,-TeluguStop.com

ఈ సినిమా గురించి తాజాగా ఒక వార్త బయటకు వచ్చింది.ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

శివ నిర్వాణ, నాని కలిసి పని చేయడం ఇది రెండవసారి.2017 లో నిన్ను కోరి సినిమాతో హిట్ కొట్టిన ఈ కాంబినేషన్ ఇప్పుడు మళ్ళీ కలిసి పనిచేయడం వల్ల ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగా పెరిగాయి.టక్ జగదీష్ సినిమాలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు.టక్ జగదీష్ సినిమాలో జగపతిబాబు కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఒకప్పుడు హీరోగా చేసిన జగపతిబాబు ఇప్పుడు విలన్ గా, తండ్రిగా, అన్నయ్యగా నటిస్తూ హీరోలకే పోటీ ఇస్తున్నాడు.

అయితే ఈ సినిమాలో జగపతిబాబు పాత్ర కీలకంగా ఉండబోతుందని సమాచారం.ఈ సినిమాలో నానికి అన్నయ్యగా జగపతిబాబు నటిస్తున్నాడు.

Telugu Jagapathi Babu, Nani, Role, Soft Role, Tollywood, Tuck Jagadish-Movie

కానీ టక్ జగదీష్ సినిమాలో ఇప్పటి వరకు రిలీజైన పోస్టర్లు, టీజర్ లో కూడా జగపతిబాబు సాఫ్ట్ రోల్ లో కనిపించారు.కానీ జగపతిబాబు పాత్ర గురించి ఇప్పుడు ఒక వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈయన ఈ సినిమాలో కనిపించేంత సాఫ్ట్ కాదట.ఈ సినిమాను ఏప్రిల్ 23 న రిలీజ్ చెయ్యబోతున్నారు.ఈయన పాత్రలో కొన్ని నెగిటివ్ షేడ్స్ ఉన్నాయని వార్త వినిపిస్తుంది.మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే ఈ సినిమా వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube