కొడుకు కోసం చెల్లిని తీసుకొచ్చిన జగపతిబాబు.. ఎఫ్.సి.యుకె టీజర్

హీరో నుంచి టర్న్ తీసుకొని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత జగపతిబాబు కెరియర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది.ఓ వైపు విలన్ వేషాలు వేస్తూ స్టార్ హీరోలకి పోటీ ఇస్తున్న జగపతిబాబు మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తండ్రి పాత్రలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయాడు.

 Jagapathi Babu Played Romantic Role In New Movie, Tollywood, Telugu Cinema, Ram-TeluguStop.com

జగపతిబాబు లుక్ కూడా అతనికి మరిన్ని అవకాశాలు తెచ్చి పెడుతుంది.అప్పుడప్పుడు రొటీన్ కి భిన్నమైన పాత్రలని కూడా జగపతిబాబు చేస్తూ మెప్పిస్తూ ఉన్నాడు.

ఈ సారి కూడా అలాంటి పాత్రతో మరోసారి ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యాడు.శ్రీరంజిత్ మూవీస్ బ్యానర్ లో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఫసక్ మూవీలో జగపతిబాబు లీడ్ రోల్ చేశారు.

ఈ సినిమాకి సంబందించిన టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.ఇందులో పెళ్లీడుకి వచ్చిన కొడుకు ఉన్న వయస్సులో కూడా అమ్మాయిలతో రొమాన్స్ చేసే వ్యక్తిగా జగపతిబాబు కనిపిస్తున్నాడు.

అలాగే తండ్రి బాటలోనే ప్లే బాయ్ గా అమ్మాయిలతో ఆడుకునే కొడుకుగా రామ్ కార్తీక్ నటిస్తున్నాడు.

Telugu Jagapathi Babu, Ram Karthik, Sri Rajinth, Telugu, Tollywood-Movie

ఇక జగపతిబాబు ఈ సినిమాలో యంగ్ బ్యూటీస్ తో భీభత్సమైన ర్ రొమాన్స్ చేసేశాడు.ఇదిలా ఉంటే కొడుకుకి పెళ్లి చేయాల్సిన వయస్సులో మరో అమ్మాయితో కలిసి ఒక చెల్లిని తీసుకొచ్చి కొడుకు చేతిలో జగపతిబాబు పెడతాడు.అక్కడి నుంచి వారి జర్నీ ఎలా సాగింది అనే ఎంటర్టైనింగ్ ఎలిమెంట్ తో సినిమాని విద్యాసాగర్ రాజు చెప్పబోతున్నట్లు తెలుస్తుంది.

ఇక టీజర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా కామెడీ టచ్ ఇస్తూ ఉంది.సంక్రాంతి బరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.దీంతో జగపతిబాబు సాలిడ్ హిట్ కొడతాడని టాక్ వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube