అక్షయ్ కుమార్ తండ్రిగా జగపతి బాబు

టాలీవుడ్ స్టార్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటుడు జగపతి బాబు.హీరోగా కెరియర్ స్టార్ట్ చేసి ఫ్యామిలీ చిత్రాలతో మహిళా ప్రేక్షకులకి చేరువ అయిన జగపతి బాబు లెజెండ్ సినిమాతో విలన్ గా టర్న్ తీసుకొని ఒక్కసారిగా అందరి దృష్టిని మరోసారి ఆకర్షించారు.

 Jagapathi Babu Played Father Role To Akshay Kumar-TeluguStop.com

ఆ సినిమా తర్వాత శ్రీమంతుడు సినిమాలో మహేష్ తండ్రిగా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించి మెప్పించాడు.ఈ రెండు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా జగపతి బాబు డిమాండ్ ని అమాంత పెంచేశాయి.

దీంతో వరుస అవకాశాలని సొంతం చేసుకుంటూ సౌత్ లో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా జగపతి బాబు మారిపోయాడు.స్టార్ హీరోల సినిమాలలో కచ్చితంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేదంటే విలన్ పాత్రలలో జగపతి ఉండటం అనేది ఈ మధ్య కామన్ అయిపోయింది.

 Jagapathi Babu Played Father Role To Akshay Kumar-అక్షయ్ కుమార్ తండ్రిగా జగపతి బాబు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Akshay Kumar, Bollywood, Jagapathi Babu, Ram Sethu Movie, Tollywood-Movie

విలన్ గా మారిన తర్వాత జగపతి బాబు తెలుగు బాషకి మాత్రమే పరిమితం కాకుండా మలయాళీ, కన్నడ, తమిళ్ బాషలలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.ఇప్పుడు బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టబోతున్నారు.అయితే బాలీవుడ్ లో విలన్ గా కాకుండా హీరో తండ్రి పాత్రలో జగపతి బాబు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కబోయే సినిమాలో జగపతి బాబు అతనికి తండ్రిగా కనిపిస్తాడని బిటౌన్ లో టాక్ వినిపిస్తుంది.

అయితే అది ఏ సినిమా అనేదానిపై ఎలాంటి క్లారిటీ లేదు.అలాగే మెయిన్ విలన్ గా కూడా ఓ యాక్షన్ మూవీలో జగపతి బాబు హిందీలో నటించబోతున్నట్లు తెలుస్తుంది.

#Akshay Kumar #Jagapathi Babu #Ram Sethu Movie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు