మహేష్‌ మూవీ నుండి ఆయన తప్పుకోవడానికి అసలు కారణం ఇదే  

Jagapathi Babu Not To Act With Mahesh Movie-

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఈమద్య కాలంలో ‘శ్రీమంతుడు’, ‘మహర్షి’ చిత్రాలతో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లను దక్కించుకున్నాడు.ఈ రెండు చిత్రాల్లో కూడా జగపతిబాబు చాలా కీలక పాత్రలో నటించాడు.ఒక సినిమాలో మహేష్‌ బాబుకు తండ్రి పాత్రలో నటిస్తే మరో సినిమాలో విలన్‌ పాత్రను పోషించడం జరిగింది.అందుకే జగపతిబాబును సెంటిమెంట్‌గా భావించిన మహేష్‌ బాబు తన ప్రస్తుత సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో కూడా తీసుకోవడం జరిగింది..

Jagapathi Babu Not To Act With Mahesh Movie--Jagapathi Babu Not To Act With Mahesh Movie-

అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో అనీల్‌ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలుకు తగ్గట్లుగా అనీల్‌ రావిపూడి ఎక్కడ కాంప్రమైజ్‌ కాకుండా చిత్రీకరిస్తున్నాడు.

ఈ సమయంలోనే సినిమా నుండి జగపతిబాబు తప్పుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.అయితే ఆ వార్తలు నిజం కాదేమో అని కొందరు అనుకున్నారు.కాని తాజాగా జగపతి బాబు స్వయంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు..

తాను ఆ సినిమా నుండి తప్పుకున్నట్లుగా ఒప్పుకున్నాడు.

దర్శకుడు మొదట నా పాత్ర గురించి చెప్పిన సమయంలో ఇంట్రెస్టింగ్‌గా అనిపించి ఒప్పుకున్నాను.తీరా సెట్స్‌కు వెళ్లిన తర్వాత సినిమాలోని నా పాత్ర వేరుగా ఉంది.అందుకే ఆ సినిమా నుండి తప్పుకున్నట్లుగా జగపతిబాబు చెప్పుకొచ్చాడు.

ఆ పాత్ర నాకు సూట్‌ అవ్వదనే ఉద్దేశ్యంతో నేను తప్పుకున్నాను.అంతే తప్ప వివాదం ఏమీ లేదని జగపతిబాబు పేర్కొన్నాడు.ఆయన తప్పుకోవడంతో ఆ స్థానంను ప్రకాష్‌ రాజ్‌తో భర్తీ చేయడం జరిగింది..

వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేసే ఉద్దేశ్యంతో అనీల్‌ రావిపూడి చాలా స్పీడ్‌గా చిత్రాన్ని పూర్తి చేస్తున్నాడు.ఈ చిత్రంలో మహేష్‌ బాబు ఆర్మీ జవాన్‌గా కనిపించబోతున్నాడు.