వీరా రెడ్డిగా రాజసం చూపిస్తున్న జగపతి బాబు!  

టాలీవుడ్ స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యెక గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు జగపతి బాబు. కెరియర్ లో హీరో నుంచి విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అయిన తర్వాత జగపతిబాబు జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. స్టార్ హీరోల చిత్రాలతో పాటు, యువ హీరోల సినిమాలలో కూడా వరుస అవకాశాలని అందుకుంటూ స్టార్ నటుడుగా, అత్యధిక రెమ్యునరేషన్ ని ప్రస్తుతం జగపతి బాబు అందుకుంటున్నాడు. ఇప్పటికే నటుడుగా తన సత్తా చాటిన జగపతి బాబు కెరియర్ లో మరో గుర్తిండిపోయే పాత్రలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్నాడు. స్టార్ కాస్టింగ్ తో భారీ బడ్జెట్ చిత్రంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతుంది.

ఇదిలా వుంటే జగపతి బాబు పుట్టిన రోజు సందర్భంగా సైరా సినిమాలో అతను చేస్తున్న వీరారెడ్డి అనే పాత్ర ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. ఇందులో జగపతి బాబు మొదటి సారి పూర్తి స్థాయిలో రాజుల నేపధ్యంలో వున్నా పాత్రలో చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక సామంత రాజుగా జగపతి బాబు లుక్ ఆకట్టుకునే విధంగా వుంది. ఇప్పటికే ఈ సినిమాలో నటించిన స్టార్ నటుల లుక్స్ చాలా వరకు బయటకి రిలీజ్ చేసారు. ఇప్పుడు జగపతి బాబుని వీరారెడ్డి పాత్రని పరిచయం చేయడం ద్వారా సైరాలో అతని పాత్ర ఎలా ఉండబోతుంది అనేది ఓ అంచనాకి వచ్చే అవకాశం వుంది.