యూ టర్న్ తీసుకున్న 'జగ్గు భాయ్'లైఫ్...! 'అరవింద సమేత' కు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా.?   Jagapathi Babu Latest Remuneration For Aravinda Sametha Movie     2018-10-17   11:45:36  IST  Sainath G

ఒకప్పుడు నటుడిగా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న జగపతి బాబు ఆడియన్స్ లో చెరగని ముద్ర వేసుకున్నాడు. జగపతి ఆర్ట్స్ అధినేత,ప్రముఖ నిర్మాత వి బి రాజేంద్ర ప్రసాద్ తనయుడైన జగపతి బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి,ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి, మెప్పించాడు. తర్వాత కెరీర్ డౌన్ అయిన టైం లో లెజెండ్ తో విలన్ గా ఎంట్రీ ఇచ్చి అంతకంటే క్రేజ్ సంపాదించుకున్నారు.

మన దగ్గర డబ్బు ఉంది అంటే పెద్దగా సంబంధం లేని చుట్టాలు కూడా వచ్చి కలిసిపోతూ ఉంటారు. అందులోను మనం మంచి వాళ్ళం అయితే ముంచేస్తారు. అదే పరిస్థితి జగపతిబాబు గారు కూడా ఓ సందర్భంలో ఎదుర్కొన్నారు. అయితే అతడు చేసిన మంచి పనులు అతన్ని మళ్ళీ మామూలు స్థాయికి తెచ్చాయని చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ విలన్ గా కొత్త అవతారం ఎత్తి డబ్బులు సంపాదిస్తున్నాడు

కష్టనష్టలు ఎదుర్కొన్న జగ్గు భాయ్ గారు ఇప్పుడు సక్సెఫుల్ గా విల్లన్ గా సెకండ్ ఇన్నింగ్స్ నడిపిస్తున్నారు. తన విలనిజం తో ఆడియన్స్ ప్రశంసలు అందుకున్నారు. లెజెండ్, రంగస్థలం ఒక ఎత్తు అయితే…అరవింద సమేత మరో ఎత్తు. పెర్ఫార్మన్స్ పీక్స్ చూపించేసారు జగ్గు భాయ్ గారు. ఒకప్పుడు విలన్ లు హిందీ వాళ్ళని తీసుకునేవారు మన తెలుగు సినిమా దర్శకులు…కానీ ఇప్పుడు అంతా జగ్గు భాయ్ వైపే ఆసక్తి చూపుతున్నారు. దీంతో వరుస ఛాన్స్ లు వచ్చి పడ్తున్నాయి. షెడ్యూలు ఖాళీ లేనంత బిజీ ఆర్టిస్ట్ అయిపోయాడు. చాలా సినిమాలు పెండింగ్ లో పెట్టేస్తుంటే,కొందరు నిర్మాతలు ఎక్కువ డబ్బులు ఇచ్చి కూడా డేట్స్ తీసుకుంటున్నారు.

Jagapathi Babu Latest Remuneration For Aravinda Sametha Movie-

నాన్నకు ప్రేమతో ,రంగస్థలం మూవీస్ లో సరికొత్త నటనతో ఆకట్టుకున్న జగపతి బాబు తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో అరవింద సమేత సినిమాలో బాసిరెడ్డి పాత్రలో జీవించాడు. మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాకు దాదాపు 2 కోట్ల వ‌ర‌కూ పారితోష‌కం తీసుకున్నాడ‌ట జ‌గ్గుబాయ్. ఇక‌పొతే మంచి క్రేజ్ రావ‌డంతో వ‌చ్చే ఆఫ‌ర్ల‌కు రెమ్యున‌రేష‌న్ అమాంతం పెంచుతున్నార‌ట. ఇక చిరు తో కలిసి నటిస్తున్న సైరా లో ఏ విధంగా ఆకట్టుకుంటారో చూడాలి.!