కండోమ్‌లు అమ్ముకుంటున్న స్టార్ నటుడు  

Jagapathi Babu To Sell Condoms In Next Movie-jagapathi Babu,shraddha Das,telugu Movie News,vidyasagar

ఒకప్పుడు హీరోగా వరుస సక్సెస్‌లు అందుకున్న ఫ్యామిలీ స్టార్ జగపతి బాబు అందరి మన్ననలు అందుకున్నాడు.అయితే కాలం కలిసిరాకపోవడంతో హీరోగా వరుస పరాజయాలు చవిచూసి, అటుపై ఫేడవుట్ హీరోగా మారాడు.

Jagapathi Babu To Sell Condoms In Next Movie-Jagapathi Shraddha Das Telugu Movie News Vidyasagar

అయితే బోయపాటి-బాలయ్య కాంబో లెజెండ్ సినిమాతో ఒక్కసారిగా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను సిక్సర్‌తో మొదలుపెట్టాడు ఈ నటుడు.ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ పాత్రలు కూడా చేస్తూ పిచ్చ డిమాండ్‌లో ఉన్నాడు.

తాజాగా ఓ చిత్రంలో లీడ్ రోల్ చేసేందుకు జగపతి బాబు ఒప్పుకున్నాడు.ఈ సినిమాలో జగ్గు భాయ్ కండోమ్స్ అమ్ముకుంటాడట.అదేనండి.కండోమ్ కంపెనీ యజమానీగా జగపతి బాబు నటిస్తాడట.ఈ సినిమా చాలా బోల్డ్‌గా ఉంటుందిని చిత్ర దర్శకుడు విద్యాసాగర్ తెలిపారు.ఇక ఈ సినిమాలో వేశ్యల జీవితాన్ని ప్రతిబింబించేలా కథను రాసుకున్నాడట దర్శకుడు.

ఈ సినిమాలో ఓ వేశ్య పాత్రలో అందాల భామ శ్రద్ధా దాస్ నటించనుంది.

ఏదేమైనా కండోమ్‌లు అమ్ముకునే పాత్ర అనగానే ఈ సినిమాలో బోల్డ్‌నెస్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

అయితే వేశ్యల జీవితాలను చూపించే క్రమంలో ఇంకా ఎలాంటి శృంగారపు సన్నివేశాలను పెట్టి ఈ సినిమాతో ప్రేక్షకులను అల్లాడిస్తారో చూడాలి.

తాజా వార్తలు