ఎన్టీఆర్ రోజూ ఫోన్ చేసి మరీ తిట్టేవాడు.. జగపతిబాబు షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ నేటితరం స్టార్ హీరో లలో ఒకరు.

 Jagapathi Babu Comments On Jr Ntr And Aravinda Sametha Veera Raghava Movie Jagap-TeluguStop.com

సినిమా సినిమాకు తన క్రేజ్ ను పెంచుకుంటూ అభిమానుల మనసులో స్థానం సంపాదించుకుంటున్నారు.జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే.

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత వీర రాఘవ గురించి మనందరికీ తెలిసిందే.

ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన విషయం అందరికి తెలిసిందే.

ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సీనియర్ నటుడు జగపతిబాబు.ఇందులో పవర్ ఫుల్ విలన్ పాత్రలో బసిరెడ్డి గా నటించారు.

జగపతిబాబు ఒకప్పుడు సినిమాల్లో హీరోగా నటించి ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఇక ప్రస్తుతం సినిమాల్లో విలన్ క్యారెక్టర్ లో నటిస్తూ దూసుకుపోతున్నారు.జగపతిబాబు కేవలం దక్షిణాది సినిమాల్లోనే కాకుండా ఉత్తరాది సినిమాల్లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.

అరవింద సమేత వీర రాఘవ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా జగపతిబాబుకి మంచి గుర్తింపు కూడా తెచ్చిపెట్టింది.ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అరవింద సమేత సినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు జగపతిబాబు.

Telugu Jagapathi Babu, Jr Ntr, Pooja Heghe, Tollywood-Movie

ఆ సినిమాను ఒప్పుకున్నందుకు ఎన్టీఆర్ తనకు కావలసినంత పనిష్మెంట్ ఇచ్చాడు అని తెలిపారు.ప్రతి రోజూ ఫోన్ చేసి వాయించేవాడు.నీ క్యారెక్టర్ ఇంత బాగుంది అంత బాగుంది అనేవాడు.అలా రక రకాలుగా తిట్టేవాడు అదికూడా ప్రేమతోనే అని చెప్పుకొచ్చారు జగపతిబాబు.సినిమా రిలీజ్ ఫంక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ అరవింద సమేత సినిమా లో సినిమా చూసే వారికి ముందుగా బసిరెడ్డి గుర్తుకు వస్తాడు.ఆ తర్వాత నేను గుర్తు ఉంటాను అని తెలిపారు.

ఇక అరవింద సమేత సినిమా తర్వాత అలాంటి పవర్ఫుల్ పాత్రలో ఇప్పటివరకు నటించలేదు అని జగపతి బాబు తెలిపారు.అరవింద సమేత సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటించిన విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube