రాజమనార్‌గా జగపతి బాబు.. అదిరిపోయిన ఫస్ట్ లుక్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను ప్రభాస్ షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

 Jagapathi Babu As Rajamanaar In Salaar, Jagapathi Babu, Salaar, Prabhas, Rajaman-TeluguStop.com

ఈ సినిమాను కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాలోని ప్రభాస్ ఫస్ట్ లుక్ ఈ సినిమా అంచనాలను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి.

కాగా ఈ సినిమాలో విలన్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది.

ఈ సినిమాలో ‘రాజమనార్’ అనే విలన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారా అనే అంశంపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో కూడా తెగ చర్చ సాగుతోంది.

అయితే ఈ సినిమాలో విలన్ పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు నటుడు జగపతి బాబు.ఈ మేరకు ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ పోస్టర్‌లో జగపతి బాబు కిల్లింగ్ లుక్‌తో నోట్లో సిగరెట్ పెట్టుకుని, ముక్కుకు పోగు పెట్టుకుని అదిరిపోయే రీతిలో కనిపించాడు.ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే తేలిపోయింది.

ఈ పాత్రలో బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ నటిస్తాడని పలువురు అనుకున్నారు.

కానీ అందరి అంచనాలను పక్కనబెడుతూ జగపతి బాబు అదిరిపోయే రీతిలో ఎంట్రీ ఇచ్చి అందరినీ అవాక్కయ్యేలా చేశారు.

ఏదేమైనా విలనిజానికి కొత్త పేరును తీసుకొచ్చిన జగపతి బాబు ఈ సినిమాలో నటిస్తుండటంతో సలార్ చిత్రంపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.ప్రభాస్ సరసన ఈ సినిమాలో అందాల భామ శృతి హాసన్ నటిస్తుండగా, ఈ సినిమాను కేజీఎఫ్ నిర్మాతలు హొంబాలే ఫిలింస్ బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.మరి సలార్ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube