సూపర్ స్టార్ రజినీకాంత్ తో మరోసారి జతకడుతున్న జగపతిబాబు...

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నాత్తై సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది.

 Jagapathi Babu Acted In Rajinikanth Annaatthe Movie,latest Movie News-TeluguStop.com

అయితే ఆరంభమైన కొద్దిరోజులకే కరోనా ఎఫెక్ట్ లాక్ డౌన్ రావడంతో షూటింగ్ వాయిదా పడిపోయింది.లాక్ డౌన్ సడలింపులతో గత ఏడాది డిసెంబర్ లో సినిమా షూటింగ్ మళ్ళీ స్టార్ట్ చేశారు.

అయితే కొద్ది రోజులు షూటింగ్ అయిన తర్వాత సడెన్ కొంత మంది యూనిట్ కి కరోనా వచ్చింది.దీంతో ఉన్నపళంగా ప్యాక్ అప్ చెప్పేశారు.

అదే సమయంలో రజినీకాంత్ కి కూడా ఆరోగ్యం దెబ్బతినడంతో ఏకంగా మూడు నెలలు షూటింగ్ కి బ్రేక్ పడిపోయింది.అయితే మళ్ళీ రజినీకాంత్ నుంచి సినిమా షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ దొరకడంతో మళ్ళీ సెట్స్ పైకి వెళ్లేందుకు దర్శకుడు శివ రెడీ అవుతున్నాడు.

త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం స్టైలిష్ యాక్టర్ జగపతిబాబుని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.

హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా టర్న్ తీసుకున్న తర్వాత జగపతిబాబు కేవలం తెలుగుకి మాత్రమే పరిమితం కాకుండా అన్ని బాషలలో దూసుకుపోతున్నాడు.తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ బాషలలో అవకాశాలు సొంతం చేసుకుంటున్నాడు.

ఈ నేపధ్యంలో ఇప్పుడు రజినీకాంత్ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం అతన్ని ఫైనల్ చేసినట్లు సమాచారం.గతంలో రజినీకాంత్, జగపతిబాబు కాంబినేషన్ లో కథానాయకుడు, లింగ సినిమాలలో కలిసి నటించారు.

ఈ రేను సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.అయితే ఇప్పుడు మూడో సారి ఈ కాంబినేషన్ కి కచ్చితంగా హిట వస్తుందని కోలీవుడ్ లో వినిపిస్తున్న టాక్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube