అడిగేవాళ్ళు లేక 7 రోజులు సెట్ లో అలాగే ఉన్నా...చివరి లైట్ బాయ్ వచ్చి ఏడ్చేశాడు... జగపతి బాబు సంచలన కామెంట్స్  

Jagapathi Babu About His Career-

జగపతి బాబు అంటే…మంచి ఫామిలీ సినిమాలు తీసే ఓ ఇన్నోసెంట్ హీరో అని అందరి అభిప్రాయం.హీరోగా మంచి గుర్తింపు పొందిన తర్వాత లెజెండ్ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ అందరి ప్రశంసలు అందుకున్నారు.ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించిన విషయాలను పంచుకున్నారు..

Jagapathi Babu About His Career--Jagapathi Babu About His Career-

హీరోగా చేసిన చాలా సినిమాలు షూటింగ్ సమయంలో నేను ఎన్నో అవమానాలు ఎదురుకున్నా అని ఆయన చెప్పారు.“ప్రొడ్యూసర్స్ నన్ను అవాయిడ్ చేసే వారు.నేను వస్తుంటే నన్ను చూసి చూడకుండా వెళ్ళిపోయేవారు.

నాకు భోజనం పెట్టని ప్రొడ్యూసర్స్ ఉన్నారు.కుర్చీ కూడా వేయని ప్రొడ్యూసర్స్ ఉన్నారు.అలాగే ఏడు రోజులు ఉన్నా సెట్ లో ..

ఎవ్వరూ అడిగేవారు లేరు.చివరికి లైట్ బాయ్ వచ్చి…మీరు హీరో అయ్యుండి ఇలా అవమానాలు పడుతున్నారు ఏంటి అని ఏడ్చేశాడు.”

కెరీర్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తను ఖర్చులకు కూడా డబ్బు లేక ఇబ్బంది పడ్డాను అని జగపతి వివరించాడు.అలాంటి సమయంలో తనకు ఎవరూ ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని, ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఎవరి నుంచి కూడా తను డబ్బు ఆశించలేదని ఈ నటుడు అన్నారు.

అయితే నిమ్మగడ్డ తనను పిలిచి.50 లక్షల రూపాయలు డబ్బు ఇచ్చారని, వడ్డీ లేకుండా తీసుకొమ్మన్నారని జగపతిబాబు చెప్పాడు.

తర్వాత అవసరమని నిమ్మగడ్డ డబ్బును వెనక్కు అడిగారని… తను వెనక్కు ఇచ్చేశానని పేర్కొన్నాడు.ప్రస్తుతం తనకు ఆర్థిక కష్టాలు ఏమీ లేవని.

‘లెజెండ్’ సినిమా తర్వాత తన దశ మారిపోయిందని జగపతి అన్నాడు.ఆ సినిమాకు తను ఊహించిన దానికి మూడు రెట్లు ఎక్కువ పారితోషకం ఇచ్చారని..

ఆ సినిమా హిట్ కావడం.విలన్‌ పాత్రలు వరస పెట్టి దక్కడంతో ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడిందని అన్నాడు.ప్రస్తుతం తను ఖరీదైన కార్లను కొనగలిగే స్థితిలో ఉన్నట్టుగా జగపతి బాబు చెప్పాడు.