104 వాహనాల ద్వారా ఆరోగ్యంధ్ర ప్రదేశ్ దిశగా జగన్ ఆలోచనలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం విషయంలో సరికొత్త నిర్ణయం తో సీఎం జగన్ ముందడుగులు వేస్తున్నారు.మేటర్ లోకి వెళ్తే రాష్ట్రంలో ప్రతి కుటుంబం యొక్క ఆరోగ్య వివరాలు ఒక రికార్డు ఉండేవిధంగా వాళ్లకి వైద్య సేవలు అందుబాటులో కల్పించే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా 104 వాహనాలు దాదాపు 656 అందుబాటులోకి తీసుకురావడానికి నిర్ణయం తీసుకున్నారు.

 Jagan's Thoughts Towards Arogyandhra Pradesh Through 104 Vehicles, Ys Jagan, Hea-TeluguStop.com

ఈ వాహనాల ద్వారా రాష్ట్రంలో డయాబెటిక్ బాధితులకు, గర్భిణీలకు, ఇతర అవుట్ పేషెంట్ రోగులకు, రోగ నిర్ధారణ పరీక్షలకి సేవలు అందించాలని డిసైడ్ అయ్యారట.

అదేవిధంగా హైపర్టెన్షన్ బాధితులకు, అవుట్ పేషెంట్ సేవలు పొందిన రోగులకు కూడా సేవలు అందించాలని జగన్ సర్కార్ డిసైడ్ అయినట్లు ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలకు మరియు పట్టణాలకు ఈ వాహనాలు పంపించడానికి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అంతమాత్రమే కాకుండా ఈ వాహనాల ద్వారా అందించే వైద్య సేవలు వలన ప్రజలలో జీవనశైలి జబ్బులు ప్రాథమిక దశలోనే గుర్తించటం మాత్రమే కాక 104 మొబైల్‌ క్లినిక్‌ ద్వారా వైద్య సేవలు అందించడం జరుగుతుందని ఇంటింటి సర్వే ద్వారా మధుమేహ రోగులను గుర్తించడం వారికి ఉచితంగా మందులు అందించే దిశలో సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో టాక్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube