జగన్ పరిస్థితి ఓడిపోయే ముందు హిట్లర్ లా ఉంది: పవన్!

వారాహి మూడో దశ యాత్ర విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా అనేక కీలక పరిణామాలు జరిగాయి.ప్రధాన ప్రతిపక్ష నేత అరెస్టు,బెయిల్ కూడా దొరకకపోవడం, ఆ తరువాత టిడిపి జాతీయ కార్యదర్శి లోకేష్( Lokesh ) అరెస్టు దిశగా సిఐడి సన్నాహాలు చేసుకోవడం, జనసేన తెలుగుదేశం లో పొత్తు ఖరారు అవ్వటం ఇలా అనేక సంచలన పరిణామాల తర్వాత జనసేన నాలుగవ దశ వరాహి యాత్ర జరుగుతుండడంతో పవన్ స్పీచ్ పై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అయింది.

 Jagan's Situation Is Like Hitler Before Defeat Pawan , Jagan, Pawan, Varahi Yat-TeluguStop.com

ముఖ్యంగా పవన్ అత్యంత ఆవేశపూరితంగా ప్రసంగించ బోతున్నాడని అధికార వైసీపీపై మాటల తూటాలు పేలుస్తాడంటూ అంచనాలు వెలుపడ్డాయి.అయితే అంచనాలకు భిన్నంగా పవన్ చాలా నిదానంగా ఓపిగ్గా మాట్లాడారు.

Telugu Jagan, Janasenatelugu, Lokesh, Pawan, Varahi Yatra-Telugu Political News

జనసేన తెలుగుదేశం కూటమి( Janasena Telugu Desam alliance ) అధికారం లోకి రావాల్సిన అవసరాన్ని, వస్తే జరగబోయే మంచిని వివరించి చెప్పిన పవన్ ముఖ్యంగా ఉద్యోగుల కష్ట నష్టాలు నిరుద్యోగుల ఇబ్బందులపై ప్రధానంగా దృష్టి పెట్టారు.2018 నుంచి డిఎస్సి ప్రకటన రాకపోవడంతో ఇంత కష్టపడి చదివిన నిరుద్యోగులు కూలి నాలి చేయలేక ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నారో నాకు తెలుసని, కనీసం ఇలాంటి వారికి నిరుద్యోగ భృతిని అయినా ఇవ్వడానికి జగన్ ప్రభుత్వం ఇష్టపడటం లేదంటూ విమర్శలు చేశారు.తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వీరిని ఆదుకుంటామని చెప్పుకొచ్చారు.

Telugu Jagan, Janasenatelugu, Lokesh, Pawan, Varahi Yatra-Telugu Political News

యువత ఎంతో విలువైన దశాబ్ద కాలం కోల్పోయిందని, కానిస్టేబుల్ అభ్యర్థుల నియామకాల్లో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇలాంటి వారందరికీ మా ప్రభుత్వం రాగానే కచ్చితంగా న్యాయం చేస్తామంటూ ఆయన చెప్పుకొచ్చారు .ముఖ్యమంత్రి పదవి వస్తే సంతోషంగా స్వీకరిస్తాను తప్ప సీఎం సీటు కన్నా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముఖ్యమని కోరుకునే మనిషిని అంటూ ఆయన వ్యాఖ్యానించారు మతం కన్నా మానవత్వం గొప్పదని నేనెప్పుడూ ఎవరిలో కులం చూడలేదని గుణమే చూసానని ప్రతి ఒక్కరిలో ప్రతిభ సామర్థ్యాన్ని మాత్రమే తాను కొలమానంగా పెట్టుకుంటానంటూ పవన్ వ్యాఖ్యానించారు.ఏది ఏమైనా తన సహజ శైలికి భిన్నంగా ఆలోచనాత్మకంగా పవన్ ఇచ్చిన స్పీచ్ ఖచ్చితంగా ఆంధ్ర ప్రజలను కదిలిస్తుందని జనసేన పార్టీ నమ్ముతుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube