జ‌గ‌న్‌కు పోల‌వ‌రం క‌న్నా అదే ముద్దా… !  

jagans love that morethan pollavaram..?, ap, andhra pradesh, political news, political war, TDP, ysrcp, jagan, jagan mohan reddy, pollavaram project, project works, ysrcp leaders, political stratagies - Telugu Andhra Pradesh, Ap, Jagan Mohan Reddy, Political News, Political Stratagies, Political War, Pollavaram Project, Project Works, Tdp, Ysrcp Leaders

పోల‌వ‌రం నిర్మించేందుకు నిధులు లేవు.కానీ.

TeluguStop.com - Jagans Love That More Than Pollavaram

కొత్త జిల్లాల ఏర్పాటుకు మాత్రం నిధులు తెస్తారా ? ఆ డ‌బ్బులేవో.పోల‌వ‌రానికే పెట్టండి అంటూ.

సోష‌ల్ మీడియాలో జ‌నాలు ఉతికి ఆరేస్తున్నారు.అయితే.

TeluguStop.com - జ‌గ‌న్‌కు పోల‌వ‌రం క‌న్నా అదే ముద్దా… -Political-Telugu Tollywood Photo Image

జ‌గ‌న్ వ్యూహం మ‌రోలా ఉంద‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు.విష‌యంలోకి వెళ్తే.

రాష్ట్ర ప్ర‌భుత్వం కొత్త జిల్లాల ఏర్పాటును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది.ఎన్నిక‌ల హామీల్లో ఇది కూడా ఒక‌టి కావ‌డంతో ప్ర‌భుత్వం దూకుడుగానే ముందుకు సాగుతోంది.

ఇప్ప‌టికే రెండు మూడు క‌మిటీలు కూడా నియ‌మిం చింది.జిల్లాల ఏర్పాటుకు ఉన్న అడ్డంకుల‌ను తొల‌గిస్తూ.

ముందుకు సాగుతోంది.

ఇక‌, అదే స‌మ‌యంలో మ‌రో కీల‌క హామీ అయిన పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తి చేసే విష‌యంలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది.

కేంద్రం నిదులు ఇవ్వ‌డం లేద‌ని కొన్నిరోజులుగా మంత్రులు ఆరోపిస్తున్నారు.ఇటీవ‌ల పెంచిన అంచ‌నాల వ్య‌యాన్ని కేంద్రం కోత పెట్టింద‌ని పేర్కొన్నారు.ఇక‌, ఎత్తు త‌గ్గించేందుకు కూడా జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌స్తున్నాయి.దీనికి కార‌ణం ఏంట‌ని ఆరాతీస్తే.

నిధులు లేవు.కేంద్రం ఇవ్వ‌దు.

అని చెబుతున్నారు.కానీ, అదే స‌మ‌యంలో జిల్లాల ఏర్పాటుపై మాత్రం దూకుడు త‌గ్గించ‌డం లేదు.

Telugu Andhra Pradesh, Ap, Jagan Mohan Reddy, Political News, Political Stratagies, Political War, Pollavaram Project, Project Works, Tdp, Ysrcp Leaders-Telugu Political News

ఇక‌, జిల్లాల ఏర్పాటు మామూలు విష‌యం కాద‌నేది అంద‌రికీ తెలంగాణ రాష్ట్రం నేర్పిన పాఠ‌మే! అక్క‌డ 10 జిల్లాల‌ను 33 జిల్లాల ‌కు మార్చిన కేసీఆర్‌.తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవ‌డానికి ఇదే కార‌ణ‌మ‌ని అంటారు.మ‌రి ఏపీలో ప‌రిస్థితి ఏంట‌ని ప్ర‌భు త్వ‌మే ఆరా తీసింది.కొత్త జిల్లాల ఏర్పాటుకు దాదాపు 1500 కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని అధికారులు లెక్క‌లు చెప్పారు.దీంతో తొలుత సీఎం జ‌గ‌న్‌.హ‌తాసులైనా.

త‌ర్వాత మాత్రం గో ఎహెడ్ అన్నార‌ని టాక్‌!! ఇక‌, ఇప్ప‌టికిప్పుడు రాష్ట్ర అవ‌స‌రాల‌ను ప‌రిశీలించి.ఈరెండు ప్రాజెక్టుల్లో ఏది ముఖ్య‌మ‌నే అంశంపై సోష‌ల్ మీడియాలో చ‌ర్చ న‌డుస్తోంది.

అవే నిధులు వెచ్చించి.క‌ళ్ల‌ముందు క‌నిపిస్తున్న పోల‌వ‌రాన్ని పూర్తి చేసుకుంటే.జిల్లాలు అనేకం అభివృద్ది చెందుతాయి.కానీ, జ‌గ‌న్ మాత్రం జిల్లాల‌కే జై కొడుతున్నారు ?  దీనికి కార‌ణం.పోల‌వ‌రం పూర్త‌యితే.ఆయ‌న‌కు ద‌క్కే క్రెడిట్ పావ‌లానే.! అనేది తెలుసుకున్నార‌ట‌.సో.దీంతో ఎన్ని కోట్లు ఖ‌ర్చ‌యినా.జిల్లాల‌కే మొగ్గు చూపుతున్నార‌ట‌.

ఇదీ సంగతి.!

#YSRCP Leaders #Andhra Pradesh #Project Works #Political War

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jagans Love That More Than Pollavaram Related Telugu News,Photos/Pics,Images..