కార్పొరేషన్ల ఏర్పాటుపై జగన్ కీలక ప్రకటన

వివిధ బీసీ ఉప కులాల కార్పొరేషన్ల ఏర్పాటుపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.వెనుకబడిన కులాల(బీసీ) కార్పొరేషన్ల డైరెక్టర్లు, చైర్మన్ల పోస్టులను ఈ నెలాఖరులోగా భర్తీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

 Ap Cm, Bc, Corporations-TeluguStop.com

ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు శంకర నారాయణ, బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీ జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వెనుకబడిన బీసీ వర్గాలకు ప్రభుత్వ ప్రయోజనాలు అందుతున్నాయా.

లేదా.అనే విషయాన్ని కార్పొరేషన్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరపాలని సీఎం ఆదేశించాడు.

ఆయన మాట్లాడుతూ.ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని, ఇప్పటి వరకూ సుమారు 2 కోట్లు ఉన్న బీసీలకు రూ.22,685.74 కోట్ల నగదు బదిలీ అందించామని సీఎం వెల్లడించారు.బీసీల అభ్యున్నతికి ఇంత వరకూ గత సీఎంలు ఎవరూ పట్టించుకోలేదు అని గుర్తు చేశారు.

ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటి తలుపు తట్టి అందిస్తున్నామన్నారు.

బీసీల కోసం మొత్తంగా (కొత్త వాటితో కలుపుకోని) 52 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.గతంలో 69 కులాలకే ప్రాధాన్యత ఇచ్చారని, ఇప్పడు అన్ని బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నామని సీఎం వ్యాఖ్యానించారు.

కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ప్రజలు బస్తీలో, కాలనీలో సమస్యలు ఉంటే అధికారుల తెలపాలని సూచించారు.

ఆ దిశగా వారు సమస్యలు పరిష్కరిస్తారని తెలియజేశారు.ఈ సమావేశం అనంతరం బీసీలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేషన్ల ఏర్పాటుపై బీసీ సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube