ఇంటి పోరే జగన్ తలపోటు ? ఆ విమర్శలకు చెక్ పెట్టేది ఎలా ?

ఏపీ సీఎం జగన్ వరుసగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న.ఎన్నో రకాల ఇబ్బందులు జగన్ ను, ఆయన ప్రభుత్వాన్ని చుట్టుముట్టాయి .

 Jagans Handling Of Sharmila Vijayamma Has Drawn A Lot Of Criticism Ys Sharmila,-TeluguStop.com

ప్రజల్లో మొదట ఉన్నంత ఆదరణ ఇప్పుడు కనిపించడం లేదు.ఇక రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న ఒత్తిడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

నిత్యం వారు జగన్ పై ఏదో ఒక విషయంలో గిల్లుతూనే వస్తున్నారు.జగన్ ప్రభుత్వానికి జనాల్లో ఆదరణ లేదని,, ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలు అమలు చేసే విషయంలో ఆయన ఫెయిల్ అయ్యారు అని ఎన్నో రకాలుగా విమర్శలు చేస్తున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే , ఇప్పుడు జగన్ కు ఇంటిపోరు పెద్ద సమస్యగా మారింది.

  ముఖ్యంగా జగన్ సోదరి వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి, తెలంగాణలో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

జగన్ తల్లి విజయమ్మ కూడా షర్మిల వెన్నంటే ఉంటూ ఆమె పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తనవంతు కృషి చేస్తున్నారు.కానీ వీరిద్దరితో జగన్ దూరంగా ఉన్నట్లు గా వ్యవహరిస్తూ ఉండడంతో, ఇప్పుడు రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.

వైఎస్ కుటుంబంలో విభేదాలు తలెత్తాయని, జగన్ సొంత ఇంట్లో వారికి న్యాయం చేయలేకపోయాడు అని, ఎన్నికలకు ముందు తన ప్రచారానికి వాడుకుని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టారనే విమర్శలు వస్తున్నాయి.దీనికి తగ్గట్లుగానే ఇటీవల వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు ఈ సంగతిని రుజువు చేస్తున్నాయి.
   

Telugu Ap Cm, Idupulapaya, Jagan, Lotus Pond, Telangana, Ysrajashekhar, Ys Sharm

 ఇడుపులపాయలో నివాళులు అర్పించిన తర్వాత వైఎస్ షర్మిల , విజయమ్మ హైదరాబాద్ వెళ్ళడం అక్కడ వైఎస్ అభిమానులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం , ఆ సమావేశానికి జగన్ తో పాటు ఆ పార్టీ లో ఉన్న కొంతమంది వైఎస్ వీర విధేయులు హాజరు కాకపోవడం వంటివి ఈ అనుమానాలకు మరింత ఊతం కలిగిస్తున్నాయి.ఇదే అంశాలను టిడిపి తమకు అనుకూలంగా వాడుకుంటూ జగన్ పై మరింతగా విమర్శల బాణాలు ఎక్కుపెడుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube