కేంద్రాన్నే బుట్టలో వేస్తున్న జగన్ ? జిల్లాల పెంపు వెనుక ఇంత స్కెచ్ ఉందా ?

ఏపీ సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా అది పెద్ద సంచలనం గానే మారుతుంది.వివాదాలకు కేంద్ర బిందువుగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఉంటున్నాయి.

 Jagan's Attempt To Form New Districts In Ap For Central Funding, Ys Jagan, Naren-TeluguStop.com

మొదటి నుంచి ఇదే వైఖరితో జగన్ పై ప్రతిపక్షాల విమర్శలు చేస్తూ వస్తున్నారు.అయినా జగన్ మాత్రం ఎక్కడ వెనకడుగు వేయడం లేదు.

ఇదిలా ఉంటే జగన్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఆయనకు ఎంత పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నాయి.అంతే స్థాయిలో ఏపీ ప్రభుత్వానికి ఆర్థిక భారంగా తయారయ్యాయి.

అసలు ఇంత ఆర్థికభారమైన పథకాలను ముందు ముందు జగన్ ఎలా కొనసాగిస్తారు అనేది అందరిలోనూ అనేక సందేహాలు నెలకొనగా, జగన్ మాత్రం సంక్షేమ పథకాలు అమలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుంటూ వస్తున్నారు.

ఇదిలా ఉంటే ముందు ముందు వీటి కారణంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనే విషయం జగన్ కు బాగా తెలుసు.

అందుకే ఆయన ఒక తెలివైన నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తున్నారు. రెండు,  మూడు రకాలుగా ఉపయోగపడే విధంగా స్కెచ్ వేసినట్టుగా కనిపిస్తున్నారు.అదే ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం.ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక జిల్లా చొప్పున ఏర్పాటు చేయడంతో పాటు, అదనంగా మరో ఏడు జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నారు.

అంటే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు మరి కొంతకాలం వాయిదా వేయించేందుకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంత అనుకుంటుండగా,  జగన్ ఆ ప్లాన్ తో పాటు మరో ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది.

Telugu Ap Cm, Chandrababu, Districts, Funds, Jagan, Boady, Ysrcp-Political

 అది ఏంటి అంటే.?  కేంద్రం జిల్లాలను యూనిట్ గా తీసుకుని పెద్ద ఎత్తున నిధులు ఇస్తుంది.కొత్త జిల్లాలకు పరిషత్తులు కూడా ఏర్పాటు అవుతాయి.

వాటికి నిధులను కేంద్రం నేరుగా ఇస్తుంది.ఉత్తరప్రదేశ్ లోనూ ఇదే విధంగా జిల్లాలు ఎక్కువగా ఉండటం, కేంద్ర నిధులు పుష్కలంగా ఉండటం వంటి కారణంగా అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని జగన్ గ్రహించారు.

ఇప్పుడు ఏపీలో అదే మాదిరిగా జిల్లాల నుంచి కేంద్ర నిధులను, సంక్షేమ పథకాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకునేందుకు ఈ ప్లాన్ వేసినట్లు గా ప్రచారం జరుగుతోంది.అలాగే జిల్లా పరిషత్తు లు కొత్తగా ఏర్పడటంవల్ల పార్టీ నాయకులకు కొత్తగా పదవులు దక్కడంతో పాటు,  చిన్నచిన్న జిల్లాల్లో పట్టు పెంచుకునేందుకు మరింతగా అవకాశం ఏర్పడుతుందని , అలాగే టిడిపిని బలహీనం చేసేందుకు ఇది ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఈ ప్రతిపాదనకు జగన్ బీజం వేసినట్టుగా కనిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube