పిల్లలకు ఇకపై జగనన్న గోరుముద్ద  

Jagannanna New Scheme Launched Gorumudha-ap Assembly Meetings,gorumudha,governament Schools,jagannanna

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో గొప్ప మార్పులు తీసుకు వచ్చేందుకు నడుం భిగించింది అంటూ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి నేడు అసెంబ్లీలో అన్నారు.విద్యార్థులకు మద్యహ్న బోజనం విషయంలో ఇన్ని రోజులు జరిగిన అవకతవకలకు ఇకపై ఫుల్‌ స్టాప్‌ పెట్టబోతున్నట్లుగా ఆయన ప్రకటించాడు.

Jagannanna New Scheme Launched Gorumudha-ap Assembly Meetings,gorumudha,governament Schools,jagannanna-Telugu Trending Latest News Updates Jagannanna New Scheme Launched Gorumudha-ap Assembly Meetings-Jagannanna New Scheme Launched Gorumudha-Ap Assembly Meetings Gorumudha Governament Schools

మద్యహ్న భోజనం పర్యవేక్షణకు నాలుగు అంచెల అధికారులను ఏర్పాటు చేయబోతున్నట్లుగా కూడా చెప్పాడు.అలాగే మద్యాహ్న భోజనం పథకానికి జగనన్న గోరుముద్ద అంటూ పేరు పెట్టినట్లుగా కూడా ఆయన ప్రకటించాడు.


విద్యార్థులకు ఆరోగ్యవంతమైన భోజనం ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో బడ్జెట్‌లో నిధులను కూడా పెంచినట్లుగా ఈ సందర్బంగా జగన్‌ అన్నాడు.రోజూ ఒకే రకమైన భోజనం కాకుండా వారంలో ఆరు రకాల భోజనాలు ఏర్పాటు చేయబోతున్నామని, ఇందుకోసం ప్రత్యేకమైన మెనూను కూడా సిద్దం చేసినట్లుగా సీఎం అసెంబ్లీలో ప్రకటించాడు.

పాఠశాలల అభివృద్దికి కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీతోనే జగనన్న గోరుముద్దను పర్యవేక్షించబోతున్నట్లుగా జగన్‌ ప్రకటించాడు.ఈ విద్యా సంవత్సరం నుండే జగనన్న గోరుముద్దను ప్రారంభించబోతున్నట్లుగా సీఎం చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు