ఒకప్పుడు చిరంజీవితో కలసి హీరోగా నటించిన ఈ నటుడు ప్రస్తుతం అవకాశాలు లేక...

సినిమా పరిశ్రమలో ఒక్కోసారి కొంత మంది నటీనటులు స్టార్ హీరోలతో కలిసి ఎంట్రీ ఇచ్చినప్పటికీ అనుకోకుండా పలు అనివార్య కారణాల వల్ల సినిమా అవకాశాలు దక్కించుకోలేక మరుగున పడిపోయిన నటీనటులు సినిమా పరిశ్రమలో చాలా మందే ఉన్నారు.కాగా అప్పట్లో తెలుగులో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన “పున్నమి నాగు” చిత్రంలో హీరోగా నటించిన ప్రముఖ సినీ నటుడు నరసింహ రాజు కూడా ఈ కోవకే చెందుతాడు.

 Jaganmohini Movie Fame Narasimharaju Facing Struggles For Offers-TeluguStop.com

అయితే పున్నమినాగు చిత్రంలో నటించడానికంటే ముందుగా నరసింహ రాజు ప్రముఖ దర్శకుడు విఠలాచార్య దర్శకత్వం వహించిన “జగన్మోహిని” అనే చిత్రం ద్వారా ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు.దీంతో నరసింహ రాజుకి వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.

అంతేకాకుండా నరసింహరాజు ఆంధ్ర కమల్ హాసన్ అని నటుడిగా బాగా గుర్తింపు తెచ్చు కున్నాడు.

 Jaganmohini Movie Fame Narasimharaju Facing Struggles For Offers-ఒకప్పుడు చిరంజీవితో కలసి హీరోగా నటించిన ఈ నటుడు ప్రస్తుతం అవకాశాలు లేక…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ పలు అనివార్య కారణాల వల్ల నరసింహ రాజు కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు.

దాంతో సినిమా అవకాశాలు కూడా పూర్తిగా కోల్పోయాడు.దీంతో అప్పుడప్పుడు పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యాడు.

కానీ బుల్లితెరలో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయిన జెమినీ టీవీలో ప్రసారమయ్యే అమ్మాయి కాపురం, చక్రవాకం, శ్రావణి సుబ్రమణ్యం, బొమ్మరిల్లు తదితర ధారావాహికలలో నటించి బాగానే ఆకట్టుకున్నాడు.అంతేగాక తమిళంలో కూడా పలు సీరియళ్లలో నటించి అక్కడ కూడా కొంత మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

ఏదేమైనప్పటికీ ఒకప్పుడు హీరోగా నటించి మెగాస్టార్ చిరంజీవి, సుమన్ వంటి స్టార్ హీరోలకి పోటీ ఇచ్చిన నరసింహ రాజు ఉన్నట్టుండి కెరియర్ ని కోల్పోవడంతో ప్రస్తుతం అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.అయితే తెలుగు, తమిళం తదితర భాషలలో 100కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించాడు.

Telugu Chiranjeevi, Jaganmohini Movie, Jaganmohini Movie Fame Narasimha Raju Facing Struggles For Offers, Narasimha Raju, Punnami Nagu, Telugu Actor-Movie

కాగా నరసింహ రాజు సినిమా పరిశ్రమకు చెందినటువంటి ఓ నటిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.కాగా ప్రస్తుతం వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు.కాగా కూతురు జగదాంబ ఓ ప్రముఖ ఐటీ సంస్థలో హెచ్.ఆర్ గా పని చేస్తుండగా కొడుకు కెనడా దేశంలోని ఓ ప్రముఖ బ్యాంకులో మేనేజర్ గా పని చేస్తున్నాడు.

#Chiranjeevi #Punnami Nagu #Narasimha Raju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు