ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో రాష్ట్రంలో లక్షల సంఖ్యలో టిడిపి( TDP ) సానుభూతిపరుల ఓట్లు భారీగా తొలగిస్తున్నారు.ఏ కారణంతో తొలగిస్తున్నారో ఆ ఓటరుకి కనీసం నోటికి నోటీసు కూడా జారీ చేయకుండా ఓట్లు తొలగించడం దారుణం.
నిబంధనల ప్రకారం ఈ తొలగింపు ప్రక్రియ (BLO) బూత్ లెవెల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరగాలి.
కానీ ఇక్కడ వాలంటీర్లు ఎలా రాస్తే అలా తొలగిస్తున్నారు.
వైఎస్సార్సీపీ పార్టీకి (YCP )అనుకూలంగా ఉండేవారికి దొంగ ఓట్లు భారీగా నమోదు చేస్తున్నారుఉదాహారణకు : గుంటూరు పశ్చిమ నియోజకవర్గం, శ్యామలానగర్ 38వ నెంబర్ బూతులో 2-14-121 గల ఇంటి నెంబర్ లో ఒకే డోర్ నెంబర్ పై 800 ఓట్లు ఉన్నాయిఒక్క బూతులోనే సుమారు 800 దొంగ ఓట్లు నమోదు అయ్యాయంటే, నియోజకవర్గం, రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని దొంగ ఓట్లు నమోదయ్యాయో ఊహించుకోండి.మన ఓటు ఉందో, లేదో తెలుసుకోవాలంటే ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన VOTER HELPLINE APP లో చూసుకోవచ్చు.