జెరూసలేం నుంచి ఇండియాకు చేరుకున్న జగన్,ఢిల్లీ పర్యటన లో బిజీ

ఇటీవల జెరూసలేం పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ముగించుకొని నిన్న ఇండియా కు తిరిగి వచ్చారు.అయితే ఈ రోజు ఆయన ఢిల్లీ పర్యటన ముందుగానే ఖరారు కావడం తో ఈ రోజు బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తుంది.

 Jagangoing To Delhiand Meetto Modi-TeluguStop.com

ఈ సందర్భంగా మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ తో భేటీ అయి కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.అలానే కేంద్రంలోని హోంమంత్రి,అలానే పలువురు మంత్రులను,రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి లను కూడా మర్యాదపూర్వకంగా కలవనున్నట్లు తెలుస్తుంది.

అలానే ఏపీ లో ని పలు కీలక అంశాలపై కూడా వారితో చర్చించనున్నట్లు తెలుస్తుంది.విభజన సమయంలోని పెండింగ్ లో ఉన్న సమస్యలు, పోలవరం, విధ్యుత్ కొనుగోలు వంటి విషయాల గురించికూడా ప్రధాని మోడీకి సవివరంగా వివరించనున్నారు.

ఈ రోజు ఢిల్లీ వెళ్లిన తరువాత మధ్యాహ్నం సమయంలో ఢిల్లీలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్న జగన్ సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీతో సమావేశం అవుతారు.

-Telugu Political News

అనంతరం రేపు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును అలానే మధ్యాహ్నం నిర్మలా సీతారామన్ లను కూడా జగన్ కలవనున్నట్లు తెలుస్తుంది.అయితే ఎలాంటి చర్చలు జరుగుతాయి, ఎలాంటి అంశాలను కేంద్రానికి విన్నవిస్తారు అన్న విషయం తెలియదు.అంతేకాకుండా ఆర్టికల్ 370 ని రద్దు చేయడం పై వైసీపీ పార్టీ హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై కూడా షా తో చర్చించనున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube