జగనన్న చేయూత పథకం రేపే ప్రారంభం..!

రాష్ట్ర మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.మహిళల సాధికారతే లక్ష్యంగా “జగనన్న చేయూత” పథకం రేపే ప్రారంభం కానుంది.

 Andra Pradesh, Cm Jagan, Jagananna Cheyutha Scheme, Minister Venugopala Krishna-TeluguStop.com

ఆగస్టు 12వ తేదీన ఈ పథకాన్ని సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ స్పష్టం చేశారు.రాష్ట్రంలో ఉన్న 45 నుం 60 ఏళ్ల మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యమని వేణుగోపాల కృష్ణ తెలిపారు.

జగనన్న చేయూత పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నేరుగా ఏడాదికి 18,750 రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని మంత్రి వేణుగోపాల కృష్ణ అన్నారు.కాగా, నాలుగేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు.రాష్ట్రంలోని 20 లక్షల మంది మహిళల కోసం ఈ ఏడాది రూ.4,700 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.ఈ పథకం ద్వారా 25 లక్షల మంది మహిళలు లబ్ది పొందనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube