వైసీపీ బీజేపీ లు మిత్రువులా శత్రువులా ? క్లారిటీ రాబోతోంది గా ?  

Are the YCP and BJP allies and enemies? As Clarity is coming , Ap, Jagan,YSRCP, Jagan, Raghu Ramakrishnam Raju, Showcause Notice, AP BJP Leaders, Chandrababu Naidu - Telugu Ap, Ap Bjp Leaders, Chandrababu Naidu, Jagan, Raghu Ramakrishnam Raju, Showcause Notice, Ysrcp

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, బిజెపి పార్టీల మధ్య స్నేహం ఉందా ? రెండు పరోక్షంగా పొత్తు పెట్టుకున్నాయా అనే అనుమానాలు 2019 ఎన్నికల్లో అందరికీ కలిగాయి.చంద్రబాబును అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా, బిజెపి వైసిపి కలిసికట్టుగా ముందుకు వెళ్ళినట్టుగా కనిపించాయి.

 Jagan Ysrcp Bjp

ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేసినా, కేంద్రం నుంచి జగన్ కు పూర్తి స్థాయిలో మద్దతు లభించడంతో పాటు, అనేక రకాలుగా సహకారం అందించాారని అప్పట్లోనే ప్రచారం జరిగింది.ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ కు బీజేపీకి సహకరించడం, ఏపీ బిజెపి నాయకులు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసైనా, బీజేపీని విమర్శించేందుకు జగన్ సాహసించలేదు.

అదే సమయంలో కేంద్ర బిజెపి పెద్దలతో సఖ్యత గా ఉంటూ, వారి నిర్ణయాలను సమర్థిస్తూ వచ్చారు.అలాగే జగన్ కు తాము అన్ని విధాలుగా సహకరిస్తామని, కేంద్ర బిజెపి పెద్దలు కూడా పదేపదే వ్యాఖ్యానిస్తూ ఉండడంతో, ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉందనే అభిప్రాయం అందరిలో కలిగింది.

వైసీపీ బీజేపీ లు మిత్రువులా శత్రువులా క్లారిటీ రాబోతోంది గా -Political-Telugu Tollywood Photo Image

కానీ, జగన్ కు అపాయింట్మెంట్లు ఇచ్చినట్టే ఇచ్చి వాటిని రద్దు చేయడం, ఏపీ బిజెపి నాయకులతో పెద్ద ఎత్తున విమర్శలు చేయించడం, జగన్ తీసుకున్న నిర్ణయాలను తప్పు పడుతూ ఉండడం వంటి పరిణామాలతో అసలు ఈ రెండు పార్టీల మధ్య స్నేహం ఉందా, ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ వైరం ఉందా అనే విషయం లో క్లారిటీ లేకుండా పోయింది.

కానీ ఇప్పుడు ఆ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.ముఖ్యంగా నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో ఆ పార్టీ ఎంపీలతో కలిసి కృష్ణంరాజు పై అనర్హత వేటు వేయాలని, స్పీకర్ ను కోరారు.దానికి కొద్దిరోజుల ముందే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి యువజన శ్రామిక రైతు పార్టీ పేరు మీద తాను గెలిస్తే, తనుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ నోటీసు జారీ చేశారని రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు .అలాగే వైసీపీ గుర్తింపు రద్దు అవుతుంది అంటూ ఆయన చెప్పడం తో రాజకీయ ప్రకంపనలు రేగాయి.అయితే ఈ వ్యవహారంలో బిజెపి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అనేదానిపై ఈ రెండు పార్టీల మధ్య ఉన్న స్నేహం కానీ వైరం కానీ, బయట పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే రఘురామకృష్ణంరాజు బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.ఆయనను బిజెపి చేర్చుకుంటుందా లేదా అసలు ఈ వ్యవహారాల్లో ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపైన ఈ రెండు పార్టీల మధ్య ఉన్న స్నేహం కానీ, వైరం కానీ బయట పడే అవకాశం కనిపిస్తోంది.

#Ysrcp #AP #Jagan #Ap Bjp Leaders

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jagan Ysrcp Bjp Related Telugu News,Photos/Pics,Images..