కేంద్రం రాష్ట్ర ల మధ్య కరోనా వార్ ? జగన్ ఏం చేశాడంటే ?

రెండో విడత కరోనా వైరస్ ప్రభావం మొదలైన దగ్గర నుంచి కేంద్రం రాష్ట్రాల మధ్య వివాదం చోటు చేసుకుంటూనే ఉంది.గతేడాది కేంద్రమే అన్ని బాధ్యతలు స్వీకరించింది.

 Jagan Wrote Letter To Chief Ministers Of All States Regarding Corona, Carona, Vi-TeluguStop.com

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో పాటు, కరోనా కట్టడికి చర్యలు తీసుకుంది.అయితే ఇప్పుడు మాత్రం కేంద్రం ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ కొనుగోలు దగ్గర నుంచి లాక్ డౌన్ సడలింపు వరకు అన్నిటినీ ఆయా రాష్ట్రాలకే వదిలివేసింది.

అంతే కాదు కేవలం తాము ఈ విషయంలో నామమాత్రమే అన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తుండడంతో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీరు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇదిలా ఉంటే కేంద్రం తీర్పు అన్ని రాష్ట్రాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.

అంతేకాదు వ్యాక్సిన్ విషయంలో అన్ని రాష్ట్రాలు ఒకే మాట మీద నిలబడి కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నాయి.దీనిలో భాగంగానే ఏపీ సీఎం జగన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.
  వ్యాక్సిన్ విషయంలో కేంద్రంతో అన్ని రాష్ట్రాలకు వివాదం ఏర్పడుతోందని, అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా ఉండాలని జగన్ లేఖలో పేర్కొన్నారు.అసలు జగన్ ఈ విధంగా లేఖలు రాయడం వెనుక కారణం ఉంది.

ఏపీతో పాటు చాలా రాష్ట్రాలు వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచినా, ఒక్క బిడ్ కూడా రాలేదు.ఇదే విషయాన్ని జగన్ తన లేఖలో పేర్కొన్నారు.వ్యాక్సిన్ కొరత పై కేంద్రం దృష్టికి రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకువెళ్లాలని జగన్ కోరారు.వాక్సిన్ కొరతను తీర్చే విషయంలో కేంద్రం పెద్దగా స్పందించకపోవడం పై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అసంతృప్తి ఉంది.

ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని చూస్తున్నారు.ఇప్పటికే కేరళ సీఎం పినరయి విజయన్ జగన్ తో పాటు ,11 మంది ముఖ్యమంత్రులకు జగన్ లేఖలు రాశారు.

అలాగే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సైతం ఇదే విధంగా లేఖలు రాశారు.

Telugu Ministers, Ap Cm Jagan, Carona, Coronavaccine, Covaxin, Covid, Coviseeld,

ఇప్పుడు జగన్ వారి బాటలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తూ కేంద్రం పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
 దేశవ్యాప్తంగా వాక్సినేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని జగన్ ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆ లేఖలో పేర్కొన్నారు.రాష్ట్రాలు వాక్సిన్ సరఫరాలో ఒకరికొకరు సహకరించుకోవాలి అని జగన్ సూచించారు.

గత నెలలోనే ఢిల్లీ , పంజాబ్ వంటి రాష్ట్రాల్లో గ్లోబల్ టెండర్లకు వెళ్లగా, మోడార్న్ , సిజర్ వంటి అంతర్జాతీయ కంపెనీలు దాన్ని తిరస్కరించి, తాము కేంద్రంతో నేరుగా వ్యవహారం చేస్తామని రాష్ట్రాలకు వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసేది లేదు అంటూ క్లారిటీ ఇచ్చేశాయి.దీంతో అన్ని రాష్ట్రాలు ఆందోళనలో ఉన్నాయి.

రాష్ట్రాలకు వ్యాక్సిన్ లు విక్రయించేలా అంతర్జాతీయ కంపెనీలకు అనుమతులు ఇవ్వడం లేదా కేంద్రం కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో కనిపిస్తోంది.అలాగే దేశీయ వ్యాక్సిన్ ఫార్ములాను ఇతర ఔషధ కంపెనీలకు ఇచ్చి వేగంగా ఉత్పత్తి పెంచకపోతే రానున్న రోజుల్లో మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన ఇప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తం చేస్తూనే కేంద్రంపై ఈ విషయంలో వెనక్కి తగ్గకుండా ఒత్తిడి పెంచే ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube