తాను తీసుకున్న గోతిలో తానే ప‌డుతున్న జ‌గ‌న్‌..!

రాష్ట్రంలో ప్రభుత్వ వైఖ‌రిపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శలు వ‌స్తున్నాయి.క‌రోనా విష‌యంలో స‌ర్కారు అవ‌లంబిస్తున్న వైఖ‌రిపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది.

 Jagan Will Fallen In His Own Creating Hole, Andhra Pradesh, Chief Minister, Jaga-TeluguStop.com

స్థానిక ఎన్నిక‌ల విష‌యంలో స‌ర్కారు ఒక వాద‌న‌ను తెర‌మీదికి తెచ్చింది.ఇప్పుడు రాష్ట్రంలో క‌రోనా తీవ్రంగా ఉంది… ఎన్నిక‌లు ఎలా నిర్వ‌హిస్తారు? అని జ‌గ‌న్ ప్ర‌భుత్వం రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌ను నిల‌దీస్తోంది.అంతేకాదు.గ‌త మార్చిలో కేవ‌లం ఒక‌టి రెండు కేసులు ఉన్న‌ప్పుడే.మీరు ఎన్నిక‌లు వాయిదా వేశారు.మ‌రి ఇప్పుడు రాష్ట్రంలో రోజుకు వేల సంఖ్య‌లో కేసులు న‌మోదవుతున్నాయి.

సో.ఇప్పుడు ఎన్నిక‌లు అవ‌స‌ర‌మా? అనేది స‌ర్కారు వాద‌న‌.

ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.స‌ర్కారు వారి ముందు చూపును అంద‌రూ అభినందించాల్సిందే.కాద‌ని.ఎన్నిక‌ల సంఘం కూడా ముందుకు వెళ్లే ప‌రిస్థితిలేని విధంగా జ‌గ‌న్ మంచి లా పాయింట్ లాగారు.

సో.రేపు కోర్టులోనూ స‌ర్కారు ఇదే వాద‌న వినిపిస్తుం ద‌న‌డంలో సందేహం లేదు.అయితే, అదే స‌మ‌యంలో ఇంత మంచి పాయింట్ ప‌ట్టుకున్నా.అంత‌క‌న్నా మించిన పాయింట్‌తో స‌ర్కారు బొక్క‌బోర్లా ప‌డే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.ఎందుకంటే.ఎన్నిక‌ల క‌న్నా కూడా అత్యంత వివాద‌మైన నిర్ణ‌యాన్ని ఇప్పుడు వైసీపీ తీసుకుంది.

తీసుకోవ‌డ‌మే కాదు.అమ‌లు కూడా చేస్తోంది.

సోమ‌వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠ‌శాల‌లు ప్రారంభించాలని స‌ర్కారు ఆదేశాలు జారీ చేసింది.నిజానికి ఇప్పుడే వ‌ద్ద‌ని ప్ర‌జాసంఘాల నుంచి డిమాండ్లు సూచ‌న‌లు వ‌స్తున్నా.స‌ర్కారు వారు మాత్రం ఏమాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు.మ‌రి ఇప్పుడు చిన్నారులవి ప్రాణాలు కావా?  అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది.ఓటు వేయ‌డానికి వ‌చ్చేవారు.18 ఏళ్లు నిండిన‌వారే.కానీ స్కూళ్ల‌కు వ‌చ్చ‌వారే 5 ఏళ్లు నిండిన‌వారు.

18 ఏళ్ల వ‌య‌సు పైబ‌డిన వారి విష‌యంలో స‌ర్కారు చూపుతున్న ముందు చూపు.ఐదేళ్లు నిండిని ప‌సిమొగ్గ‌ల ప్రాణాల విష‌యంలో ఎందుకు ఆలోచించ‌డం లేదు.ఇదిత‌ప్పుడు నిర్ణ‌యం కాదా.రేపు కోర్టులో ఇదే పాయింట్ అడిగితే.దానికి స‌ర్కారు ఏం స‌మాధానం చెబుతుంది? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.ఇవ‌న్నీ గ‌మ‌నిస్తున్న ప‌రిశీలకులు. జ‌గ‌న్ తాను తీసుకున్న గోతిలో తానే ప‌డుతున్నార‌ని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube