జగన్ పగటి కలలు ఫలిస్తాయా!!!

ఆశ ఉండడం మానవ నైజం.కానీ అత్యాశ అనేది ఎప్పటికైనా అలా అతిగా ఆశ పడే వారికి ఇబ్బందులను తెచ్చిపెడుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

 Jagan Will Be Ap Cm In Next 2 Years-TeluguStop.com

విషయానికి వస్తే ప్రస్తుత ప్రభుత్వం మరో రెండు ఏళ్ల కన్నా ఎక్కువ అధికారంలో ఉండదని జగన్ సోది చెబుతున్నారు.గతంలో అంటే ఎన్నికల ముందు కూడా జగన్ తాను ముఖ్యమంత్రి అయిపోతానని, ప్రజల కష్టాలు తీర్చేస్తానని ఎన్నో.

ఎన్నెన్నో మాటలు చెప్పారు.కానీ కట్ చేస్తే అధికారానికి దూరమై ప్రతిపక్ష నేతగా మారిపోయారు.

పోనీ హంగు లాంటి సీన్ ఏమైనా ఉందా పదిమంది ఎమ్మెల్యేలను కొనేస్తే పనైపోతుందా అంటే ఆ అవకాశం కూడా లేకుండా పూర్తి మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది చంద్రబాబు సర్కార్.అయితే అదంతా పక్కన పెడితే ఇప్పుడు వచ్చే రెండు ఏళ్లలో జగన్ ముఖ్యమంత్రిగా చక్రం తిప్పుతారని చెబుతున్నాడు…ఇదేదో ముఖ్యమంత్రి పదవిపై తనకున్న మోజో లేక అధికారం కోసం తాను చెబుతున్న మాట కాదంట.

ఈ మాట చెప్పింది చాలామంది జ్యోతీష్యులు అట.జ్యోతిష్కులు చెప్పినదాని ప్రకారం చంద్రబాబు మరో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం అధికారంలో ఉండరట.చంద్రబాబు కాకపోతే.వేరే ఆప్షన్ తాను తప్ప వేరెవరూ లేరన్నది జగన్ కాన్ఫిడెన్స్ కావచ్చు.మరి జగన్ కంటున్న ఈ పగటి కలలు ఫలిస్తాయా.రెండేళ్ల తర్వాత రాష్ట్రానికి జగనే ముఖ్యమంత్రి అవుతాడా అన్న ఆలోచన నిజమో కాదో తెలియాలంటే మాత్రం రెండు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube