ఎన్టీఆర్ సెంటిమెంట్‌ను ఉప‌యోగిస్తున్న జ‌గ‌న్‌.. అందుకోసం ప‌క్కా ప్లాన్‌

ఏపీ సీఎం జగన్ పాలనలో ఎన్టీఆర్ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.సర్టెన్ కండిషన్స్ మంత్రులు ఫాలో కాకపోతే వారిని పదవుల నుంచి తప్పించనున్నట్లు ఆల్రెడీ జగన్ స్పష్టం చేశారు.

 Jagan Who Is Using Ntr Sentiment  Hence The Plan, Jagan, Ntr , Ntr Plan , Cabine-TeluguStop.com

ఈ క్రమంలోనే మంత్రి వర్గం ఏర్పడి రెండున్నరేళ్లు అవుతుండగా.జగన్ మళ్లీ తన కేబినెట్‌ను పునర్ వ్యవస్థీకరించేందుకు కసరత్తులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

అయితే, సొంత పార్టీ నేతలకు త్వరలోనే జగన్ షాక్ ఇవ్వబోతున్నారన్న మాట.మంత్రి పదవులు పొందిన వారిలో తమ పని తీరుతో తమను తాము నిరూపించుకున్న వారిపై వేటు పడే అవకాశం ఉండబోదు.కానీ, మాత్రం పనిలో నిబద్ధత కనబర్చని వారిపై మాత్రం చర్యలుండే అవకాశాలు కనిపిస్తున్నాయి.జగన్ కేబినెట్‌లో ప్రజెంట్ 25 మంది మంత్రులున్నారు.కాగా, వీరిలో ఎంత మంది పదవులు ఊడిపోతాయోననే చర్చ ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో జరుగుతున్నది.

గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో మంత్రివర్గంపై అసహనానికి గురై ఒక్క కలం పోటుతో మొత్తం మంత్రివర్గాన్ని రద్దు చేసేసి మళ్లీ నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడు.

ఇలాంటి నిర్ణయమే జగన్ తీసుకునే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు.

Telugu Ap, Ap Poltics, Change, Extend, Jagan, Ntr, Ys Jagan, Ysr Cp-Telugu Polit

వైసీపీ నేతల అభిప్రాయం ప్రకారం అమాత్యుల్లో దాదాపు 18 మందిని మార్చే చాన్సెస్ ఉన్నాయట.అయితే, ఉద్వాసనకు గురైన వారికి ఇతర పదవులు కట్టబెట్టనున్నారట.ఈ క్రమంలోనే పవర్ ఫుల్ పోస్టుల్లో రెడ్లకే ప్రాధాన్యత ఇవ్వున్నారని సమాచారం.

మంత్రివర్గంలోకి మధ్యలో తీసుకున్న సీదరి అప్పలరాజు, సీహెచ్ గోపాలకృష్ణ మాత్రం పదవుల్లో కొనసాగుతారన్న అభిప్రాయాలు వినబడుతున్నాయి.వారి పని విషయంలో జగన్ సంతృప్తిగానే ఉన్నట్లు వినికిడి.ఈ నేపథ్యంలో ఏపీ కేబినెట్‌లో ఏం జరగబోతున్నదని రాజకీయ వర్గాలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి.చూడాలి ఏమవుతుందో మరి.ప్రక్షాళన జరుగుతుందా? లేక ఉన్నవారు కొనసాగుతారా? అనే సంగతులు తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube