విశాఖలోనే పాలన ? మోదీ అమిత్షాలకూ ఆహ్వానం ?

ఆరు నూరైనా నూట నలభై ఆరైనా  జగన్ అనుకున్నది అనుకున్నట్టుగా చేసి చూపించాలనే  వ్యవహార శైలితో ఉంటారు.ఏ విషయంలోనూ రాజీ పడకుండా తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

 Jagan Who Is Going To Start Administration Soon From Visakhapatnam-TeluguStop.com

ఇప్పటి వరకు ఎన్నో హామీలను విజయవంతంగా అమలు చేసి చూపించిన జగన్ కు మూడు రాజధానుల వ్యవహారం ఒక మింగుడుపడని సమస్యగా మారిపోయింది.మూడు రాజధానులు ఏర్పాటు  వ్యవహారం కోర్టు వరకు వెళ్లడంతో,  అక్కడి నుంచి ఇంకా తీర్పు రాకపోవడంతో అధికారికంగా రాజధాని ని ఏర్పాటు చేసేందుకు జగన్ కు అడ్డంకులు ఏర్పడ్డాయ.

  అయితే ఇప్పటికే రెండేళ్ల పరిపాలన పూర్తి అయిపోయింది.

 Jagan Who Is Going To Start Administration Soon From Visakhapatnam-విశాఖలోనే పాలన మోదీ అమిత్షాలకూ ఆహ్వానం -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరో మూడేళ్లు అయినా ఈ కోర్టు వ్యవహారం తెలుతుందా అనేది అనుమానంగానే ఉంది.

ఒకవేళ అదే జరిగితే టిడిపి ఈ విషయంలో  పైచేయి సాధించినట్లు అవుతుంది.అదే జరిగితే రాజకీయ ఇబ్బందులు ఎదుర్కోవాలనే ఆందోళనలు జగన్ ఉన్నారు.

అందుకే అనధికారికంగా రాజధానిని ఏర్పాటు చేస్తే తమ మాట చెల్లుబాటు అవ్వడంతో పాటు,  కోర్టులో ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే ఆలోచనతో గత కొంతకాలంగా విశాఖ పై ప్రత్యేక దృష్టి పెట్టి భారీగా నిధులను కేటాయిస్తున్నారు.అలాగే ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అనువైన పరిస్థితులను కల్పిస్తున్నారు.

త్వరలోనే విశాఖలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసే ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం ఉంది. జులై లోనే ఈ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించాలని చూసినా, ఆగస్టు 15 నాటికి దానిని వాయిదా వేశారట. 

Telugu Amith Sha, Ap, Chandrababu, Jagan, Kurnool High Court, Modhi, Tdp, Vizag Capital, Ysrcp-Telugu Political News

ఇక్కడే అసలు ట్విస్ట్ జగన్ ఇచ్చారు.ఈ క్యాంప్ కార్యాలయం ప్రారంభానికి ప్రధాని మోదీ,  అమిత్ షా లను పిలిచినట్టు విశ్వసనీయ సమాచారం.అలాగే కర్నూల్ లో న్యాయ రాజధాని ఏర్పాటుకు తగిన సహాయం అందించాలని ఇటీవల ఢిల్లీ వెళ్లిన జగన్ అమిత్ షాను కోరినట్టు తెలుస్తోంది.ఇది ఇలా ఉంటే అమిత్ షా , మోదీ ఇద్దరూ జగన్ ఆహ్వానం మేరకు విశాఖ కు వచ్చే అవకాశం కనిపించడం లేదు.

ఎందుకంటే ఆ రోజు స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆ ఇద్దరు నాయకులు బిజీగా ఉంటారు కాబట్టి వారు రావడం అనుమానమే.

#Ysrcp #Vizag Capital #Jagan #Modhi #Chandrababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు