జగన్ అస్సలు ఊహించలేదుగా ? క్రెడిట్ కొట్టేసిన బాబు ? 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన దగ్గర నుంచి  అధికారంలోకి వచ్చే వరకు జగన్ కు సెంటిమెంట్ బాగా పని చేసింది.పార్టీ స్థాపించే ముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం చెందడం తో  ఆ తర్వాత జగన్ పార్టీ పెట్టడంతో.

 Jagan Who Gained Sympathy In The Crowd With His Tears Jagan, Ysrcp, Ap, Tdp, Bhu-TeluguStop.com

జనల్లోను సింపతి కనిపించింది.  తర్వాత జగన్ మండుటెండను సైతం లెక్కచేయకుండా, సుదీర్ఘంగా ఏపీలో పాదయాత్ర నిర్వహించడం వంటివి ఆయన పై సానుభూతి కలిగేలా చేసింది .అదే 2019 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధించి పెట్టింది.కరోనా సమయంలో ఏపీకి ఎదురైన ఆర్థిక ఇబ్బందులను సైతం లెక్కచేయకుండా , అప్పులు తెచ్చి అయినా సరే జనాలకు ఇబ్బంది కలగకుండా జగన్ పరిపాలన సాగిస్తున్న తీరు,  జనాల్లో జగన్ పై మరింత అభిమానం కలిగేలా చేస్తూ వస్తోంది.

  అయితే ఇప్పుడు ఆ సానుభూతి , సెంటిమెంట్ తగ్గింది .దీనికి అనేక కారణాలు ఉన్నాయి.
         జగన్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు, మంత్రులు ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా తమ నోటికి పని చెబుతున్నా, వారిని కంట్రోల్ చేయకుండా మరింతగా జగన్ ప్రోత్సహిస్తున్నారనే అభిప్రాయం కలుగుతోంది .దీనికి తోడు రెండు రోజుల క్రితం ఏపీ అసెంబ్లీ లో కొంతమంది మంత్రులు చంద్రబాబు పై పరోక్షంగా కొన్ని వ్యక్తిగత విమర్శలు చేశారు .దీనిపై చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించి కన్నీళ్లు పెట్టుకున్నారు.40 ఏళ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఎప్పుడు కన్నీళ్లు పెట్టడం ఎవరు చూడలేదు.  ఎంతటి ఉపద్రవకరమైన ధైర్యంగా ఎదుర్కొంటూ చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు.అటువంటి బాబు ఇప్పుడు ఏడుపు మొహం తో మాట్లాడిన తీరు ప్రతి ఒక్కరికి ఆవేదన కలిగించింది.

  చంద్రబాబును రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు జగన్ వ్యక్తిగత విమర్శలు చేయిస్తున్నారు అనే అభిప్రాయం లోకి వెళ్ళిపోయింది.
   

Telugu Ap Cm Jagan, Ap, Bhuvaneswari, Jagan, Jagan Cbn, Rajashekara, Ysrcp-Telug

    2019 ఎన్నికలకు ముందు జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో కోడి కత్తి తో ఓ యువకుడు దాడికి పాల్పడడం వంటి సంఘటనలు జగన్ కు సానుభూతి తెచ్చిపెట్టి,  ఎన్నికల్లో విజయానికి ఒక కారణంగా నిలిచాయి.  ఇప్పుడు అదే విధంగా చంద్రబాబు కన్నీళ్లు ఆయనకు సానుభూతి తీసుకురావడంతో పాటు,  2024 ఎన్నికల్లో అధికారంలోకి తీసుకువచ్చే అవకాశం కలిగేలా చేసింది.  సామాన్యుల లోనూ చంద్రబాబు పై సానుభూతి పెరుగుతూ వస్తోంది.

ఇక నందమూరి కుటుంబం సైతం బాబుకు అండగా నిలబడడం,  పొరుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు చంద్రబాబు కు ఫోన్ చేసి ఓదార్చడం ఇవన్నీ టిడిపి,  చంద్రబాబుకు ఆనందాన్ని కలిగించే అంశాలే.ఈ తరహా ఓదార్పు ఎప్పటి నుంచో బాబు కోరుకుంటున్నారు.

ఈ ఘటన తో కుప్పం l మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి ఓడిపోయినా  , ఆ సంగతి జనాల్లో చర్చకు రాకుండా చంద్రబాబు కన్నీళ్లు బాగా పనిచేసాయనే చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube