వైసీపీ జెడ్పీ చైర్మన్ ల లిస్ట్ రెడీ ! వారు వీరే ? 

ఏపీలో జడ్పిటిసి,  ఎంపిటిసి ఎన్నికల ఫలితాలపై కోర్టు క్లారిటీ ఇవ్వడంతో రేపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ అధికారులు చేపట్టి, అనంతరం ఎన్నికల ఫలితాలను అధికారులు ప్రకటించనున్నారు.ఎన్నికల ఫలితాలపై వైసిపి మొదటి నుంచీ నమ్మకం తో ఉంది.

 Jagan Who Finalized The Zp Chairman Candidates For All The Districts In Ap , Ysr-TeluguStop.com

గెలుపు తమనే వరిస్తుందని, గట్టి నమ్మకంతో ఉంది.గతంలో వచ్చిన పంచాయతీ,  మున్సిపల్ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ వైసిపి దాదాపు అన్ని చోట్ల క్లీన్ స్వీప్ చేస్తుందనే ధీమా ఆ పార్టీ నాయకుల్లో పెరిగింది.

మున్సిపల్  పంచాయతీ ఎన్నికల్లో బోర్లా లో పడిన టిడిపి ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల ఫలితాలపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు.అధికారపార్టీకి మెజార్టీ స్థానాలు దక్కుతాయని ఆ పార్టీ కూడా అంచనా వేస్తోంది.

కాగా వైసీపీ శ్రేణుల్లో మాత్రం జోష్ కనిపిస్తోంది.ఎన్నికల ఫలితాలకు ముందే జడ్పీ ఛైర్మన్ ల ఎంపిక ప్రక్రియను అప్పుడే వైసిపి పూర్తి చేసింది .ఏ జిల్లా నుంచి ఎవరిని జడ్పీ చైర్మన్ గా ఎవరెవరిని నియమించాలి అనే విషయంలో ఇప్పటికే ఆ పార్టీ ఒక అంగీకారానికి వచ్చేసింది.సామాజిక సమీకరణలు ఆధారంగా ఒక లిస్టు ను తయారు చేశారు.

ఎంపీపీ విషయంలోనూ ఇదే ఇదే విధమైన ప్రక్రియను అవలంభించబోతున్నారు.జడ్పీ చైర్మన్ ల విషయంలో చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి .అయితే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్ ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేసినట్లు సమాచారం.
 

Telugu Ap, Ap Mptc Zptc, Chandrababu, Jagan, Ysrcp, Zp Chairmans-Telugu Politica

జడ్పీ చైర్మన్ అభ్యర్థులు వీరే

విజయనగరం – మజ్జి శ్రీనివాసరావు, విశాఖపట్నం శివ రత్నం, గుంటూరు – క్రిస్తినా, ప్రకాశం – బూచేపల్లి వెంకాయమ్మ, పశ్చిమ గోదావరి – కౌరు శ్రీనివాస్, కృష్ణ జిల్లా – ఉప్పళ్ళ హారిక, కడప – ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, నెల్లూరు – ఆనం అరుణమ్మ, చిత్తూరు – శ్రీనివాసులు, తూర్పుగోదావరి -విప్పర్తి వేణుగోపాల్ , అనంతపురం – గిరిజ  ఇంకా కొన్ని జిల్లాల్లో విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube