మెగా స్టార్ పొలిటికల్ స్టార్ అవుతారా ?జగన్ భయం అదేనా ?

మొన్నటి వరకు సైలెంట్ గానే ఉన్న మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాకు ఆక్సిజన్ బ్యాంకును ఏర్పాటు చేశారు.సొంత నిధులతో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం చేపట్టడంతో అభిమానుల్లో ఎక్కడలేని ఆనందం కనిపించింది.

 Jagan Who Did Not Care Much For Megastar Chiranjeevi, Megastar Chiranjeevi, Chir-TeluguStop.com

ఇప్పటివరకు కేవలం సినీ పరిశ్రమ నుంచి సహకారం అందిస్తుండటం తో మెగా బ్రదర్స్ ఏం చేస్తున్నారు అనే సందేహం తెర పైకి వచ్చింది.కోట్ల రూపాయలు వెనకేసుకున్న చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ సమయంలో సహాయ పడటం లేదు అనే విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఈ విషయాలు చిరంజీవి వరకు వెళ్లడంతో ఆగమేఘాలమీద రెండు రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు.ఇక మెగా అభిమానులు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా హైలెట్ చేస్తున్నారు.

కానీ ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం నుంచి అంతగా సానుకూలత రాకపోవడం  ఎక్కడా వైసిపి నాయకులు మెగాస్టార్ చేసిన మంచి పనిని ప్రశంసింకాకపోవడం వంటివి చిరంజీవికి కాస్త బాధ కలిగించే విషయాలే.

జగన్ గురించి మెగాస్టార్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నా, జగన్ మాత్రం ఆ విధంగా చేయకపోవడం చిరు కు బాధ కలిగించింది.

అయితే ఇదంతా చిరంజీవి ఆషామాషీగా చేయడం లేదని , ఆయనకు పొలిటికల్ ఎజెండా ఉందని,  ప్రస్తుతం వచ్చిన క్రేజ్ ను ఉపయోగించుకుని మళ్లీ రాజకీయాల్లో యక్టీవ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని , జగన్ వరకు సమాచారం వెళ్లడంతోనే వ్యూహాత్మకంగా ఈ విషయంలో మెగాస్టార్ కు క్రెడిట్ రాకుండా సైలెంట్ అయిపోయినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీకి , జగన్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు.

టిడిపి బిజెపి పార్టీ లతో సఖ్యత గా ఉంటూ,  ప్రతి సందర్భంలోనూ తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్నారని జగన్ అభిప్రాయపడుతున్నారు.ఇప్పుడు కాకపోతే 2024 ఎన్నికల సమయం నాటికైనా మెగాస్టార్ చిరంజీవి పవన్ పక్కకు వెళ్తారని, జనసేనలో ఆయన యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని జగన్ కు అనుమానము ఉంది.

Telugu Ap, Chiranjeevieye, Chiru, Jagan, Janasena, Janasenani, Chiranjeevi, Pawa

  అదే జరిగితే చిరంజీవి కారణంగా తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని గ్రహించిన జగన్ ఆక్సిజన్ ప్లాంట్ల విషయంలో సైలెంట్ అయిపోయినట్లుగా కనిపిస్తున్నారు మరోపక్క తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు చిరంజీవి చేసిన సహాయాన్ని నేర్చుకుంటూ ఉండగా వైసిపి మాత్రం నోరు మెదపడం లేదు.మొదట్లో జగన్ ను చిరంజీవి రెండు మూడు సందర్భాల్లో కలిశారు.జగన్ పరిపాలన ను మెచ్చుకున్నారు.అలాగే చిరంజీవి ని సైతం జగన్ ప్రశంసించారు.కానీ ఇప్పుడు ఈ విధంగా వ్యవహరించడం వెనుక చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ పై ఉన్న అనుమానాలే కారణంగా కనిపిస్తోంది.అందుకే మెగాస్టార్ కు ఆక్సిజన్ అందకుండా జగన్ జాగ్రత్త పడుతున్నట్లు గా కనిపిస్తున్నారు.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube