జ‌గ‌న్ ఓటు మ‌ళ్లీ ఆమెకేనా... ఆ ప‌ద‌వి ఖ‌రారైన‌ట్టే...!

ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా ఆమోదం పొందింది.దీంతోనే ఆమె రాజీనామా చేసిన స్థానానికి త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

 Jagan Vote Again To Her Confirmed That Seat To Her, Ap Cm, Ys Jagan, Jagan, Vote-TeluguStop.com

దీంతో ఆ స్తానంలో మ‌ళ్లీ సునీత‌కే అవ‌కాశం ఇవ్వాల‌ని సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు.ఇప్పుడు ఆమె పోటీ చేస్తే ఏక‌గ్రీవంగానే మ‌రోసారి ఎమ్మెల్సీ కానున్నారు.

గ‌తంలో టీడీపీలో ఉన్న మాజీ మంత్రి డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద రావు టీడీపీకి రాజీనామా చేయ‌డంతో పాటు త‌న ఎమ్మెల్సీ ప‌ద‌విని కూడా వ‌దులుకుని వైసీపీలోకి వ‌చ్చారు.

ఆ త‌ర్వాత ఆ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ డొక్కాకే ఛాన్స్ ఇవ్వ‌గా ఆయ‌న వైసీపీ ఎమ్మెల్సీగా గెలిచారు.

ఇప్పుడు పోతుల సునీత రాజీనామాతో జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లోనూ ఆమెనే తిరిగి అభ్య‌ర్థిగా బ‌రిలో దింపాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.మూడు రాజ‌ధానుల విష‌యంలో టీడీపీని వ్య‌తిరేకించిన సునీత ఆ త‌ర్వాత త‌న భ‌ర్త పోతుల సురేష్‌తో క‌లిసి జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చేశారు.

Telugu Ap Cm, Chandra Babu, Mla, Incharge, Jagan, Pothula Sunitha, Seat, Vote, Y

ఇప్ప‌టికే చీరాల‌లో ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం, నియోజ‌క వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ వ‌ర్గాల పోరు మామూలుగా లేదు.ఇప్పుడు పోతుల సునీత‌కు కూడా జ‌గ‌న్ మ‌ళ్లీ ఎమ్మెల్సీ ఇస్తే మ‌రో గ్రూపు త‌యార‌వుతుందా ? అన్న సందేహాలు అక్క‌డ రాజ‌కీయ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతున్నాయి.పార్టీలు మారిన క‌ర‌ణం, పోతుల సునీత ఇత‌ర నేత‌ల‌కు ప్ర‌యార్టీ ఎక్కువ అవ్వ‌డంతో స్థానికంగా పార్టీ కోసం ఎప్ప‌టి నుంచో క‌ష్ట‌ప‌డిన నేత‌ల‌కు గుర్తింపు ఉండ‌డం లేద‌న్న ఆవేద‌న కూడా పార్టీ వ‌ర్గాల్లో ఉంది.

గ‌తంలో టీడీపీలో ఉన్న‌ప్పుడు సునీత 2014 ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయారు.

ఆ త‌ర్వాత చంద్ర‌బాబు ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చినా.గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ ఓడాక అధికారంలో లేమ‌ని వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube