విజయసాయిరెడ్డి జగన్ మధ్య గ్యాప్ ఎందుకు ? ఇందుకేనా ?

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆ పార్టీలో జగన్ తర్వాత మొత్తం అన్ని వ్యవహారాల్లోనూ చక్రం తిప్పగల సమర్థవంతమైన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు.

 Why Difference Comes Between Vijaysai Reddy And Jagan Mohan Reddy What Is The Re-TeluguStop.com

ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంటూ తమ రాజకీయ ప్రధాన ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ పార్టీకి వీర విధేయుడిగా ఉంటూ వస్తున్నారు.ఆయన పార్టీలో నెంబర్ టు స్థానంలో ఉంటూ వచ్చారు.

పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ వ్యవహారాలు ఏదైనా జగన్ వద్దకు వెళ్లాలంటే ముందుగా విజయసాయిరెడ్డి కి తెలియాల్సిందే.అంతగా ఆయన పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పట్టు సాధించారు.

అయితే కొంతకాలంగా జగన్ ఆయనను పక్కన పెట్టారనే వార్తలు పెద్దఎత్తున వస్తున్నాయి. విశాఖ ఎల్జి పాలిమర్ దుర్ఘటన జరిగిన సమయంలో బాధితులను పరామర్శించేందుకు సీఎం జగన్ వైజాగ్ వెళ్లేందుకు సిద్ధమయిన సమయంలో జగన్ కారులో విజయసాయిరెడ్డి ఎక్కగా, ఆయనను దించి వేసి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ని జగన్ కారులో ఎక్కించుకున్నారు.

ఇక అప్పటి నుంచి జగన్, విజయసాయి రెడ్డి మధ్య ఏదో గ్యాప్ ఉందనే అనుమానాలు బయలుదేరాయి.దీనిని బలపరిచేలా అప్పటి నుంచి జగన్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి యాక్టీవ్ అయ్యారు.

అన్ని వ్యవహారాల్లోనూ ఆయనే హడావుడి చేస్తూ వస్తున్నారు.మీడియా సమావేశాలు నిర్వహిస్తూ బాగా యాక్టివ్ గా ఉంటున్నాడు.విశాఖ ఎల్జి పాలిమర్ సంఘటన పైన జగన్ విజయసాయి రెడ్డిని మాట్లాడొద్దని సూచించినట్లు ప్రచారం జరిగింది.మొత్తంగా చూస్తే విజయ్ సాయి రెడ్డి వ్యవహార శైలిపై జగన్ అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు రావడం, అదే సమయంలో విజయసాయిరెడ్డి సైలెంట్ అవ్వడం మరింత అనుమానాలు పెంచింది.

ఈ వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరగడం, విజయసాయి ని జగన్ పెట్టారని ప్రచారం ఊపందుకోవడంతో నేరుగా విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చి నేను ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంటే ఉంటాను అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.అలాగే విశాఖ ఎల్జి పాలిమర్ సంఘటన పైన విజయసాయిరెడ్డిని జగన్ మాట్లాడవద్దని సూచించారని ప్రచారం జరుగుతోంది.

Telugu Alla Nani, Jagan, Sajjalarama, Telugudesham-Political

మొత్తంగా చూస్తే విజయసాయిరెడ్డి వ్యవహారంలో జగన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రచారం ఊపందుకుంది.ప్రస్తుతం వైసీపీలో జగన్ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి హవా నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది.సీఎం జగన్ చేస్తున్న సమీక్షలు, కార్యక్రమాలోనూ సజ్జల కనిపిస్తున్నారు.ఇదిలా ఉంటే వైసీపీకి విజయసాయి రెడ్డి వంటి నాయకులు అవసరం ఉందని, ప్రధాన రాజకీయ ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ విమర్శలు తిప్పికొట్టడం లో విజయసాయిరెడ్డి పై చేయి సాధిస్తున్నారని, ఆయన యాక్టివ్ గా ఉంటేనే పార్టీలో కొత్త ఉత్సాహం వస్తుందని పలువురు సూచిస్తున్నారు.

కానీ జగన్ విజయసాయి రెడ్డి మధ్య గ్యాప్ రావడానికి అసలు కారణం ఏంటనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియడం లేదు.ఢిల్లీలో ఆయన వైసీపీ సంబంధించి రాజకీయ వ్యవహారాలు చక్కబెట్టడం లో విఫలమవుతున్నారని జగన్ అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది.

అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి విజయసాయి రెడ్డి జోక్యం ఎక్కువైందని, అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో తాత్కాలికంగా జగన్ ఆయనను పక్కన పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది.కానీ ఆయన యాక్టివ్ గా ఉంటేనే వైసీపీకి ఎదురు లేకుండా ఉంటుందనేది మెజారిటీ వైసీపీ నాయకుల అభిప్రాయం.

మరి ఈ విషయంలో జగన్ ఏ విధంగా ముందుకు వెళతాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube